|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Jana Nayagan : జన నాయగన్ సినిమాపై అనిరుద్ రియాక్షన్, చాలా బాధగా ఉందంటూ…

Published: 10-12-2025, 11:48 AM
Jana Nayagan : జన నాయగన్ సినిమాపై అనిరుద్ రియాక్షన్, చాలా బాధగా ఉందంటూ…
  • విజయ్ ‘జన నాయగన్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల.
  • అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించారు.
  • ఇది విజయ్ చివరి సినిమా కావడం బాధగా ఉందని అనిరుద్ వెల్లడించారు.
  • ‘భగవంత కేసరి’ రీమేక్ అని వార్తలు, ప్రభాస్ ‘రాజా సాబ్’తో పోటీ.

ఇళయ దళపతి విజయ్ ‘జన నాయగన్’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం అందించిన అనిరుద్ రవిచంద్రన్, ఇది విజయ్ చివరి సినిమా కావడం పట్ల బాధను వ్యక్తం చేశారు. బాలకృష్ణ ‘భగవంత కేసరి’ రీమేక్ అని వస్తున్న వార్తలు, ప్రభాస్ ‘రాజా సాబ్’తో పోటీ వంటి అంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

విజయ్ – తెలుగు ప్రేక్షకుల అనుబంధం

Jana Nayagan : ఇళయ దళపతి విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తన సినిమా ప్రమోషన్స్ కి ఈ మధ్యకాలంలో హైదరాబాద్ రావడం పూర్తిగా మానేసినా కూడా అతని సినిమాలను ఫస్ట్ డే చూసే అభిమానులు తెలుగులో కూడా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. త్రీ ఇడియట్ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఆ సినిమా కొంతమేరకు మంచి సక్సెస్ సాధించింది.

ఆ తరువాత ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఆ సినిమా ప్రమోషన్స్ తర్వాత మళ్లీ హైదరాబాద్ రాలేదు విజయ్. కానీ అతని సినిమాలు ఇక్కడ మంచి రెస్పాన్స్ సాధించుకున్నాయి. ఇక ప్రస్తుతం జననాయగన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నట్లు రీసెంట్ గా మీడియాతో తెలిపాడు అనిరుద్ రవిచంద్రన్. అనిరుద్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక మామూలు శీను కూడా తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తాడు.

అనిరుద్ సంగీతం, భావోద్వేగం

ఇదివరకే విజయ్ కు మాస్టర్ లియో సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించాడు అనిరుద్. అన్నిటిని మించి గుర్తుండిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు. అయితే ఈ సినిమాకి ఇంకొంచెం ఎక్స్ట్రాగా వర్క్ చేస్తున్నట్లు తెలిపాడు. అలానే ఇది ఇళయ దళపతి విజయ్ లాస్ట్ సినిమా అవ్వడం తనకు చాలా బాధగా ఉంది అని కూడా చెప్పాడు అనిరుద్.

బాలకృష్ణ మరియు కాజల్ కలిసి జంటగా నటించిన భగవంత కేసరి సినిమాకు ఈ సినిమా రీమేక్ అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీని గురించి మాత్రం అధికారక ప్రకటన ఇవ్వలేదు. కానీ ఇప్పటివరకు విడుదలైన కంటెంట్ చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది.

జన నాయగన్ రీమేక్, బాక్సాఫీస్ పోటీ

ఇకపోతే తెలుగులో అదే రోజు ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా ఇక్కడ విడుదలకు సిద్ధం అవుతుంది. తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పడతారు. రీమేక్ అని తేలిపోయింది అంటే ఉన్న ఆసక్తి కూడా కొంతమందికి తగ్గిపోతుంది అని చెప్పొచ్చు.

జన నాయగన్ సినిమాపై అనిరుద్ రియాక్షన్, రీమేక్ వార్తలు, రాజా సాబ్ తో పోటీ వంటివి సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. సంక్రాంతి బరిలో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.