|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ ‘జన నాయగన్’: రిలీజ్ డేట్ ఫిక్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!!

Published: 01-04-2026, 1:35 AM
విజయ్ 'జన నాయగన్': రిలీజ్ డేట్ ఫిక్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!!
  • విజయ్ కెరీర్‌లోనే చివరి సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
  • ఏప్రిల్ 24న ‘జన నాయగన్’ విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు!
  • సెన్సార్ సమస్యలను అధిగమించి విడుదల కానున్న ‘జన నాయగన్’!
  • విజయ్ సినిమా విడుదలైన ఆరు రోజులకే ధనుష్ ‘కరా’ విడుదల కానుంది.

దళపతి విజయ్ అభిమానులకు ఇది నిజంగా ఒక శుభవార్త! విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతోంది. ఈ సినిమా పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

విజయ్ చివరి సినిమా విడుదల ఎప్పుడంటే?

Jana Nayagan: కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’. దాదాపు మూడు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ సినిమా విడుదలపై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తోంది. విజయ్ కెరీర్‌లో చివరి సినిమా కావడంతో పాటు, ఇది పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యంతో కూడిన చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

సెన్సార్ అడ్డంకులు తొలగిపోయాయ్!

నిజానికి, జన నాయగన్(Jana Nayagan) సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9నే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, చిత్రంలోని కొన్ని వివాదాస్పద రాజకీయ సంభాషణలు, సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అలాగే కోర్టు కేసుల కారణంగా అనుకున్న సమయానికి సినిమా విడుదల కాలేదు. దీంతో, విజయ్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ అయ్యారు.

ధనుష్‌తో విజయ్ పోటీ!

అయితే, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ 24వ తేదీన ‘జన నాయగన్’ను విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక విజయ్ సినిమా విడుదలైన ఆరు రోజుల వ్యవధిలోనే, అంటే ఏప్రిల్ 30న స్టార్ హీరో ధనుష్ నటించిన ‘కరా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనివల్ల ఏప్రిల్ చివరి వారంలో బాక్సాఫీస్ వద్ద ఇద్దరు అగ్ర హీరోల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. ప్రస్తుతం సెన్సార్ సమస్యలను అధిగమించి ఈ తేదీకే సినిమా వస్తుందని అంతా భావిస్తున్నారు. మరి అన్ని అడ్డంకులను దాటుకుని వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.

విజయ్ ‘జన నాయగన్’ విడుదల గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.