
📌 Key Points
- విజయ్ నటించిన ‘జన నాయగన్’ విడుదలపై మళ్లీ సందిగ్ధత, అభిమానుల్లో నిరాశ!
- సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, కోర్టు తీర్పు వాయిదాతో సినిమా విడుదల ఆలస్యం!
- రీ-సెన్సార్ కోసం 20 రోజుల సమయం పట్టే అవకాశం, విడుదల మరింత ఆలస్యం కానుందా?
- విజయ్ కెరీర్ లో చివరి సినిమా కావడంతో బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!
తమిళ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలపై ఊహించని ట్విస్ట్! సెన్సార్ సమస్యలు, కోర్టు కేసుల కారణంగా సినిమా విడుదల మళ్ళీ వాయిదా పడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
విడుదలకు బ్రేక్ వేసిన సెన్సార్ అభ్యంతరాలు!
Jana Nayagan: తమిళ స్టార్ విజయ్ జన నాయగన్ సినిమా విడుదలపై తీర్పు మళ్ళీ వాయిదా పడింది. మంగళవారం ద్విసభ్య ధర్మాసనం ఇరి వర్గాల వాదనలను వినడం జరిగింది. ఈమేరకు సెన్సార్ బోర్డు తరుపు న్యాయవాది జన నాయగన్ సినిమా రీ సెన్సార్ చేయడానికి మరో 20 రోజుల సమయం పడుతుంది అని వివరించారు. అలాగే నిర్మాణ సంస్థ తరుపున న్యాయవాది రిలీజ్ ఆలస్యం అవడం వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపాడు.
కోర్టు తీర్పు వాయిదా.. ఫ్యాన్స్ నిరాశ!
ఇరువురి వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం తీర్పును మరోసారి వాయిదా వేసింది. దీంతో, ఈసారి ఖచ్చితంగా తుది తీర్పు వస్తుంది అని ఆశించిన మేకర్స్ కి నిరాశే మిగిలింది. దీంతో, జన నాయగన్ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రీ సెన్సార్ కి కనీసం 20 రోజుల సమయం పడుతుంది అని సూచించారు కాబట్టి వచ్చే నెలలో కూడా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం తక్కువే.
విజయ్ కెరీర్ లో చివరి సినిమా విడుదల ఎప్పుడో?
ఇక తీర్పు మళ్ళీ వాయిదా పడటంతో విజయ్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. నిజానికి జన నాయగన్(Jana Nayagan) సినిమా జనవరి 9 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, సెన్సార్ అభ్యంతరాల కారణంగా చివరి నిమిషంలో సినిమా వాయిదా పడింది. ఇక అక్కడి నుంచి ఈ సినిమా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఓపక్క ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే, ఇది విజయ్ కెరీర్ లో చివరి సినిమా కావడం. అందుకే, తమ హీరోకి బ్లాక్ బస్టర్ సెండాఫ్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ, సినిమా మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు.
జన నాయగన్ సినిమా విడుదల విషయంలో ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి. ఫ్యాన్స్ వేచి చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


