|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OFFICIAL TEASER DATE: ‘జానకి యుద్ధం త్వరలో ప్రారంభమవుతుంది’ అంటూ JSK నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్

Published: 03-06-2025, 10:34 AM
OFFICIAL TEASER DATE: ‘జానకి యుద్ధం త్వరలో ప్రారంభమవుతుంది’ అంటూ JSK నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్

యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా టీజర్ విడుదల తేదీని అనుపమ పరమేశ్వరన్ ప్రకటించారు. సురేష్ గోపీ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది.

Key Points

1

‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్!

2

అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపీ ప్రధాన పాత్రధారులు.

4

జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల.

‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ టీజర్ విడుదల తేదీ

యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. ఈ మూవీలో మలయాళ ప్రముఖ కథానాయకుడే సురేష్ గోపీ అండ్ టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం అందించగా.. జె. ఫణీంద్రకుమార్ నిర్మించారు. ఈ మూవీ కోర్డు డ్రామాగా రూపొందిందని.. జానకి అనే మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ద్వారా ఎలా ఎదుర్కున్నదనేది ఈ మూవీ కాన్సెప్ట్ అని ఇప్పటికే మేకర్స్ చెప్పిన విషయం తెలిసిందే.

అలాగే కేసు వాదించే లాయర్‌గా సురేష్ గోపీ నటించారనీ వెల్లడించారు. ఇక ఇందులో మాధవ్ సురేష్ గోపీ, బైజు సంతోష్, దివ్య పిళ్లయి,అస్కర్ అలీ.. తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి గిరీష్ నారాయణన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి పోస్టర్లు విడుదల అయ్యి.. ప్రేక్షకుల వద్ద నుంచి భారీ రెస్పాన్స్ లభించింది.

నటీనటుల వివరాలు

అయితే తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానుల కోసం భారీ గుడ్ న్యూస్ అందించింది. ‘‘ఆమె నిశ్శబ్దంగా ఉంది, బలహీనంగా లేదు. జానకి యుద్ధం త్వరలో ప్రారంభమవుతుంది. ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అఫీషియల్ టీజర్ రేపు (జూన్ 4)సాయంత్రం 6 గంటలకు విడుదల కానుందని పంచుకుంది. ఈ పోస్ట్‌కు అనుపమ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘ఆమె బలహీనంగా కాదు, నిశ్శబ్దంగా ఉంది. జానకి యుద్ధం త్వరలో ప్రారంభమవుతుంది. #JSK నిజం గెలుస్తుంది’’. అని జోడించింది. ఇక ఈ చిత్రం జూన్ 20 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వనుంది.

సినిమా విడుదల తేదీ

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా టీజర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. జూన్ 20న విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.