
ఓటీటీలో హారర్ సినిమాలు ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటాయి. ఇప్పుడు, తమిళ హారర్ థ్రిల్లర్ ‘జన్మ నక్షత్రం’ రెండు ఓటీటీల్లో విడుదలైంది. ప్రేతాత్మ, రాజకీయ నాయకుడు మరియు డబ్బు రహస్యం చుట్టూ తిరిగే కథ ఇది.
Key Points
రెండు ఓటీటీల్లో విడుదలైన వణికించే హారర్ థ్రిల్లర్!
జన్మ నక్షత్రంతో వెంటాడే ప్రేతాత్మ కథ!
ట్విస్టులతో నిండిన ఆకట్టుకునే కథనం!
జన్మ నక్షత్రం: కథా సారాంశం
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. విభిన్న జోనర్లలో సినిమాలు వచ్చినప్పటికీ హారర్, కామెడీ వంటి సినిమాలే ఎక్కువగా ఓటీటీ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇక రీసెంట్‌గా ఓటీటీలోకి వణుకుపుట్టించే ఓ హారర్ థ్రిల్లర్ సినిమా వచ్చేసింది.
అదే జెన్మ నచ్చతిరం. ఇది ఒక తమిళ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా. జెన్మ నచ్చతిరం అంటే తెలుగులో జన్మ నక్షత్రం అనే అర్థం వస్తుంది. సినిమా కూడా ఇదే కాన్సెప్ట్‌తో నడుస్తుంటుంది. ఓ పొలిటిషియన్ అక్రమంగా సంపాదించిన డబ్బును ఓ బంగ్లాలో దాచి ఉంచుతారు. అది అనుకోకుండా ఆ రాజకీయ నాయకుడు నోటి వెంట నుంచే వస్తుంది.
దాంతో చాలా మంది కన్ను ఆ డబ్బు మీద పడుతుంది. కానీ, ఆ బంగ్లాలో ఏదో దుష్ట శక్తి, ప్రేతాత్మ ఉందని అంతా భయపడుతుంటారు. మరోవైపు హీరో తాను రాసిన కథను సినిమాగా తీయాలని నిర్మాతల చుట్టూ తిరుగుతాడు. కానీ, అతనికి ఎక్కడ ఆఫర్ రాదు. దాంతో నువ్వే ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయొచ్చుగా అని ప్రెగ్నెంట్‌గా ఉన్న తన భార్య సలహా ఇస్తుంది.
రెండు ఓటీటీల్లో విడుదల
అప్పుడే హీరోకు రాజకీయ నాయకుడి డబ్బు ఉన్న బంగ్లా గురించి తెలుస్తుంది. ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి బంగ్లాకు వెళ్లిన హీరోకు ఏం జరిగింది?. బంగ్లాలో ఉన్న ప్రేతాత్మ ఏవరిని ఏం చేసింది?. వారికి ఆ బంగ్లాకు ఉన్న సంబంధం ఏంటీ? మరోవైపు హీరో భార్యకు వచ్చే పీడ కలలు ఏంటీ? తనను భయపెట్టే చిన్న పాప ఎవరు? జెన్మ నక్షత్రంతో వెంటాడే ప్రేతాత్మ నుంచి ఎలా తప్పించుకున్నారు? అసలు తప్పించుకున్నారా లేదా? వంటి ట్విస్టులు తెలియాలంటే? జెన్మ నచ్చతిరం చూడాల్సిందే.
ట్విస్టులతో వణికించే హారర్ థ్రిల్లర్ జెన్మ నచ్చతిరం ఓటీటీలోకి వచ్చేసింది. ఒక్కదాంట్లోనే కాకుండా రెండు ఓటీటీల్లో జెన్మ నచ్చతిరం డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. టెంట్‌కొట్టా ఓటీటీతోపాటు అమెజాన్ ప్రైమ్‌లో జెన్మ నచ్చతిరం ఓటీటీ రిలీజ్ అయింది.
నటీనటులు మరియు సిబ్బంది
అయితే, ప్రస్తుతం తమిళంలో మాత్రమే జెన్మ నచ్చతిరం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు బి మణివర్మన్ దర్శకత్వం వహించారు. ముచ్చెటమలు పట్టించే ఈ హీరర్ థ్రిల్లర్ సినిమాతో మాల్వీ మల్హోత్రా హీరోయిన్‌గా తమిళంలో ఎంట్రీ ఇచ్చింది.
హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఎంచక్కా జెన్మ నచ్చతిరం మూవీని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.
జన్మ నక్షత్రం సినిమా ట్విస్టులు, థ్రిల్లింగ్ సన్నివేశాలతో హారర్ ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. రెండు ఓటీటీల్లో చూడండి!


