
📌 Key Points
- పవన్ కళ్యాణ్, విజయ్ కెరీర్‌లలో సారూప్యతలు, రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ.
- విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ 3 గంటల 3 నిమిషాల సుదీర్ఘ నిడివితో వస్తోంది.
- ప్రస్తుత ట్రెండ్‌లో ఇంత నిడివి గల చిత్రాలకు ప్రేక్షకుల ఓపిక తగ్గిందని సినీ వర్గాల అభిప్రాయం.
- విజయ్ చివరి సినిమా కాబట్టే డ్యూరేషన్ విషయంలో రాజీ పడలేదని కోలీవుడ్‌లో వాదన.
విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ విడుదల కానున్న నేపథ్యంలో సినిమా నిడివిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 3 గంటల 3 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రానికి ప్రేక్షకులు అంత సేపు కూర్చుంటారా? పవన్ కళ్యాణ్ తో విజయ్ కెరీర్ పోలికలు కూడా చర్చనీయాంశంగా మారాయి.
విజయ్ – పవన్ కళ్యాణ్ ప్రయాణం: పోలికలు
Jananayagan : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయ్ కి కూడా దాదాపు అదే స్థాయి క్రేజీ ఉంది. ఇంకా ఓపెన్ గా మాట్లాడితే విజయ్ సభలకు పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువమంది జనాలు హాజరవుతున్నారు. అయితే దాదాపు పవన్ కళ్యాణ్ మరియు విజయ్ జర్నీ ఒకేలా అనిపిస్తూ ఉంటాయి.
మామూలుగా విజయ్ చేసిన కొన్ని సినిమాలను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ ను విజయ్ రీమేక్ చేస్తున్నాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే విజయ్ కూడా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో పొలిటికల్ గా బాగా బిజీ అయిపోయారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పొలిటికల్ మీటింగ్స్ లో పాల్గొంటున్నారు విజయ్.
హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ జననాయగన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుంచి విడుదలైన సాంగ్ కూడా విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. మరోవైపు విజయ్ నటిస్తున్న లాస్ట్ సినిమా కాబట్టి విజయ్ అభిమానులంతా కూడా ఎంతో క్యూరియాసిటీతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
జననాయగన్: నిడివిపై ఆందోళనలు
ఇకపోతే ఈ సినిమా డ్యూరేషన్ మూడు గంటలు మూడు నిమిషాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో ఒక సినిమాకి మూడు గంటలు డ్యూరేషన్ అంటే అది చాలా పెద్ద రిస్కీ పాయింట్. సినిమా కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటే కానీ ఆడియన్స్ కి అంత సేపు కూర్చునే ఓపిక ఈరోజుల్లో లేదు.
ఈరోజుల్లో సక్సెస్ఫుల్ గా ఆడియన్స్ ని హోల్డ్ చేయటం అనేది మోస్ట్ సక్సెస్ పాయింట్. ఎందుకంటే ఓపిక అనేది చాలామందికి తగ్గిపోయింది. సినిమా ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోయినా కూడా ఆడియన్ ఫోన్లో మునిగిపోతారు. అందుకే చాలామంది ప్రముఖ దర్శకులు వాళ్ళ సినిమా డ్యూరేషన్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటారు.
చివరి సినిమా కాబట్టే అంత నిడివా?
ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సితార ఎంటర్టైన్మెంట్ లో వచ్చే కొన్ని సినిమాల సంబంధించి డ్యూరేషన్ విషయంలోనే పర్టికులర్ గా పట్టించుకుంటారు అని నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఇకపోతే విజయ్ చివరి సినిమా కాబట్టి ఈ సినిమా డ్యూరేషన్ ఇంత ఉంచారు. అనేది కొంతమంది నుంచి కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వాదన.
మొత్తానికి, ‘జననాయగన్’ డ్యూరేషన్, విజయ్ రాజకీయ ప్రవేశం, చివరి చిత్రం వంటి అంశాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ప్రేక్షకులను అంతసేపు కట్టిపడేస్తుందా లేదా అనేది విడుదల తర్వాత తేలుతుంది.


