|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘జననాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కత్తి పట్టిన ఖాకీ పోస్టర్‌తో హైప్ పెంచేశారుగా..

Published: 22-06-2025, 3:43 AM
‘జననాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కత్తి పట్టిన ఖాకీ పోస్టర్‌తో హైప్ పెంచేశారుగా..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయగన్’ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సంగ్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న ఈ చిత్రం కొత్త పోస్టర్‌తో హైప్‌ను పెంచింది.

Key Points

1

జననాయగన్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

2

సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల.

4

పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

రిలీజ్ డేట్ ఖరారు

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’(Jananayagan). ఇక విజయ్ సినీ కెరీర్‌లో చివరి చిత్రంగా తెరకెక్కుతున్న ఈమూవీకు హెచ్ వినోద్(H. Vinod) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మమిత బైజు(Mamitha Baiju), బాబీ డియోల్(Bobby deol) కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్.

క్రేజీ పోస్టర్ వైరల్

నేడు దళపతి విజయ్ బర్త్‌డే సందర్భంగా జననాయగన్ మూవీ రిలీజ్ డేట్‌తో పాటు క్రేజీ పోస్టర్‌ను షేర్ చేశారు మేకర్స్. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి(Pongal) సందర్భంగా జనవరి 9న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. విజయ్ ఖాకీ డ్రెస్సులో ఓ పొడవాటి కత్తిని పట్టుకుని రౌడీల వైపు సీరియస్‌గా నడుచుకుంటు వస్తున్నాడు. అతనికి ఎదురుగా విలన్లు కూడా కత్తులు పట్టుకుని ఉన్నారు. అయితే విజయ్ నడిచి వస్తున్నప్పుడు అతని కాళ్ల కింద, అండ్ బ్యాక్ గ్రౌండ్‌లో మొత్తం ఫైర్ అంటుకుని ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది.

సినిమాపై ఆసక్తి పెరుగుదల

A post shared by Vijay (@actorvijay)

విజయ్ అభిమానులకు సంక్రాంతి పండుగ కానుకగా ‘జననాయగన్’ సినిమా రిలీజ్ అవుతోంది. కత్తి పట్టుకున్న విజయ్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.