
విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా యూఎస్ ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమాకు వచ్చిన రివ్యూలు మిశ్రమంగా ఉన్నాయి. కొందరు ప్రశంసలు తెలిపితే మరికొందరు విమర్శలు చేస్తున్నారు.
Key Points
కింగ్డమ్ మూవీకి యూఎస్ ప్రీమియర్స్ తర్వాత పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.
ఇంటర్వెల్ బ్యాంగ్, అనిరుధ్ సంగీతం, విజయ్ యాక్టింగ్ ప్రశంసలు అందుకుంటున్నాయి.
కొంతమంది సెకండాఫ్ కాస్త డల్ అని అభిప్రాయపడుతున్నారు.
ట్విటర్ లో కింగ్డమ్ రివ్యూలు
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ గురువారం (జులై 31) కింగ్డమ్ మూవీతో మరో అగ్ని పరీక్షకు సిద్ధమయ్యాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు సోషల్ మీడియాలో మిక్స్‌డ్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. యూఎస్ ప్రీమియర్స్ చూసిన అభిమానులు చాలా వరకు సినిమా బాగుందని ట్విటర్ రివ్యూలు ఇస్తున్నారు.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గురువారం ఉదయం నుంచే కింగ్డమ్ మూవీ హడావిడి మొదలు పెట్టారు. దీంతో ఎక్స్ లో #KingdomMANAMKODTHUNAM టాప్ ట్రెండింగ్ లో ఒకటిగా ఉంది. యూఎస్ ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకు చాలా వరకు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్ట్స్ లెవెల్ అని చాలా మంది అంటున్నారు. అనిరుధ్ బీజీఎం ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ అని కూడా స్పష్టం చేశారు.
అనిరుధ్ సంగీతం, విజయ్ నటన ప్రశంసలు
విజయ్ దేవరకొండ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సినిమా ద్వారా దక్కిందని, విజయ్ తో ఇలాంటి స్క్రిప్ట్ కోసమే ఇన్నాళ్లూ వేచి చూశామని అభిమానులు అంటున్నారు. ఇక రగిలే రగిలే సాంగ్ అయితే ఫ్యాన్స్ థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మరచిపోలేకపోతున్నారు. అటు మహిళా అభిమానులు కూడా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్న వీడియో ఒకటి ఎక్స్ లో వైరల్ అవుతోంది.
కింగ్డమ్ తో ఈసారి కొడుతున్నాం అని ప్రీరిలీజ్ ఈవెంట్లో విజయ్ గట్టిగానే చెప్పాడు. ఏదో ఒక రోజు రూ.200 కోట్ల క్లబ్ లోనూ చేరతానని అన్నాడు. ఇప్పుడు అతని అభిమానులు విజయ్ కొట్టేసినట్లే అని, ఈ మూవీకి రూ.200 కోట్లు ఖాయమని ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన తెలుగు సినిమాల్లో ఇదే బెస్ట్ ఫస్టాఫ్, బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని.. విజయ్ పర్ఫార్మెన్స్, అనిరుధ్ బీజీఎం మరో లెవెల్ అని ఓ యూజర్ ట్వీట్ చేశారు.
పాజిటివ్ మరియు నెగటివ్ రివ్యూల మిశ్రమం
అనిరుధ్ ఓ మ్యూజికల్ సూపర్ స్టార్.. కింగ్డమ్ బ్లాక్‌బస్టర్ అని మరో వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేశారు. “రగిలే రగిలే మొత్తం తగలబెట్టేశాడు.. దేవరకొండ స్క్రీన్ ప్రజెన్స్, అనిరుధ్ బీజీఎం టాప్ నాచ్. సినిమాటోగ్రఫీ, టెక్నికల్ విషయాలు కూడా చాలా బాగున్నాయి. హిట్ కొట్టేశాడు” అని మరో అభిమాని ట్వీట్ చేశారు.
అయితే సెకండాఫ్ కాస్త డల్లుగా సాగిందన్న రివ్యూలు కూడా కొంతమంది ఇస్తున్నారు. కింగ్డమ్ లో కొత్తదనమేమీ లేదని, ఇదో రొటీన్ సినిమా అయినా కొన్ని సీన్లు మాత్రం బాగున్నాయని, ఒకసారి చూడొచ్చనీ మరికొందరు ట్వీట్లు చేశారు. దీనివల్ల మూవీకి అక్కడక్కడా మిక్స్‌డ్ రివ్యూలు కూడా వస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే కొన్ని స్పెషల్ షోలు కూడా పడ్డాయి. వీటి నుంచి పూర్తిస్థాయి రివ్యూలు త్వరలోనే రాబోతున్నాయి. మొత్తానికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను మాత్రం ఈ సినిమా బాగా నచ్చేసినట్లు ఎక్స్ రివ్యూలు చూస్తే స్పష్టమవుతోంది.
మొత్తంగా, కింగ్డమ్ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. మొదటి భాగం అద్భుతంగా ఉందని, అయితే రెండవ భాగం కాస్త నిరాశపరిచిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


