
📌 Key Points
- జాన్వీ కపూర్ మొదటి సినిమా ‘ధడక్’ విడుదల తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లారట – షాకింగ్ నిజం!
- ‘ధడక్’ సినిమాలో తన నటన బాగాలేదని, ప్రేక్షకులు తనను ఇష్టపడటం లేదని జాన్వీ భావించారు.
- శ్రీదేవి మరణం తర్వాత ఎమోషనల్‌గా వీక్ అయ్యానని, ఆడియన్స్ నుండి కాన్ఫిడెన్స్ ఆశించానని జాన్వీ తెలిపారు.
- ‘ధడక్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 110 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘ధడక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ సినిమా తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లడానికి గల కారణం ఏంటో తెలుసా?
డిప్రెషన్‌లో జాన్వీ కపూర్ – అసలు ఏం జరిగింది?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ 2018 నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టయితే, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయినా సరే, తన నటన, అందంతో లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది. శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ.. సినిమా ప్రయాణం అనుకున్నంత సులువుగా సాగలేదు. ఒకానొక టైంలో తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని స్వయంగా జాన్వీనే చెప్పింది. జాన్వీ కపూర్ తన మొదటి సినిమా ‘ధడక్’ రిలీజ్ తర్వాత ఎదుర్కొన్న కష్టాల గురించి ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది.
శ్రీదేవి మరణం తరువాత.. 2018లో వచ్చిన ధడక్ సినిమాతోనే ఆమె యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టింది. కానీ, ఆ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలు తనకు అంత సంతోషాన్ని ఇవ్వలేదట. రీసెంట్ గా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన జాన్వీ, ‘ధడక్’ రిలీజ్ తర్వాత తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని చెప్పింది. జనాలు తనను అస్సలు ఇష్టపడటం లేదని అప్పట్లో అనిపించినట్టు ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘ధడక్’ సినిమాతోనే కెరీర్ ప్రారంభం
జాన్వీ మాట్లాడుతూ, “ఎవరైనా నా మొదటి సినిమా ‘ధడక్’ గురించి మాట్లాడితే, అందులో నేను బాగా నటించానని, సినిమా హిట్టయిందని అంటారు. కానీ నా జ్ఞాపకాలు వేరేలా ఉన్నాయి. ఆ సమయంలో నేను డిప్రెషన్‌లో ఉన్నాను. నా పని అయిపోయింది, జనాలు నన్ను ద్వేషిస్తున్నారు అనిపించింది. ఎందుకో తెలియదు అమ్మ(శ్రీదేవి) చనిపోయిన తర్వాత నేను ఎమోషనల్‌గా చాలా వీక్‌గా మారిపోయాను. అమ్మ నుంచి వచ్చే కాన్ఫిడెన్స్‌ను అప్పుడు ఆడియన్స్ నుంచి ఆశించాను, కానీ అన్ని వైపుల నుంచి అనుకున్న రెస్పాన్స్ రాకపోవడంతో, కేవలం నెగటివ్ విషయాల మీదే దృష్టి పెట్టడం మొదలుపెట్టాను.” అని జాన్వీ కపూర్ చెప్పింది.
జాన్వీ కపూర్ మాట్లాడుతూ ” సినిమా హిట్ అయ్యి.. అంతా బాగుంది అనుకుంటున్నా.. నేను కేవలం నెగటివ్ కామెంట్స్ మాత్రమే పట్టించుకునేదాన్ని. ‘ధడక్’ ఒక సక్సెస్‌ఫుల్ సినిమా అనే విషయం నాకు అస్సలు అర్థం కాలేదు. నేను సరిగ్గా నటించలేదు, జనాలు నన్ను ఇష్టపడటం లేదు అనే ఫీలింగ్‌లోనే ఉండిపోయాను” అని జాన్వీ చెప్పుకొచ్చింది. ధడక్’ సినిమా మరాఠీ బ్లాక్‌బస్టర్ ‘సైరాట్’కు రీమేక్. దీనికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించగా, కరణ్ జోహార్ నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 110 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
నెగటివ్ కామెంట్స్‌పైనే దృష్టి పెట్టిన జాన్వీ
జాన్వీ కపూర్ కెరీర్ విషయానికొస్తే, ఆమె ఇటీవల ‘సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో కనిపించనుంది. ఎన్టీఆర్ సరసన నటించిన దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీఇచ్చింది జాన్వీ కపూర్. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటాలని చూస్తోంది. పెద్ది సినిమా సక్సెస్ అయితే.. జాన్వీ కపూర్ డిమాండ్ మరింతగా పెరగబోతుంది.
జాన్వీ కపూర్ డిప్రెషన్ గురించి చెప్పిన ఈ షాకింగ్ విషయాలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


