|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మా అమ్మ మరణం కొందరికి వినోదం.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్

Published: 04-09-2025, 2:53 AM
మా అమ్మ మరణం కొందరికి వినోదం.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్

దివంగత నటి శ్రీదేవి మరణం గురించి ఆమె కుమార్తె జాన్వీ కపూర్ తన బాధను, కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించింది. శ్రీదేవి మరణాన్ని కొందరు వినోదంగా చూశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Key Points

1

జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి మరణం గురించి తన బాధను వ్యక్తం చేసింది.

2

శ్రీదేవి మరణం తర్వాత కుటుంబం ఎదుర్కొన్న అవమానాలు, మీడియా ఒత్తిడిని జాన్వీ వివరించింది.

4

తల్లి నుండి పొందిన ప్రోత్సాహం, విలువలు తన జీవితంలో ఎంతో ముఖ్యమైనవని జాన్వీ తెలిపింది.

శ్రీదేవి మరణంపై జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అందం, అభినయానికి ప్రతీకగా నిలిచిన నటి శ్రీదేవి. బాలనటిగా వెండితెరపై అడుగుపెట్టిన శ్రీదేవి తన అందం, అభినయంతో అభిమానులను అలరించింది. తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో అగ్రహీరోలతో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో హిట్‌ సినిమాలు, అవార్డులు అందుకున్న ఆమె ఆకాల మరణం ఇండస్ట్రీకి ఎంత లోటు. తాజాగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన తల్లి, దివంగత నటి శ్రీదేవి మృతిని గుర్తు చేసుకుంటూ చేసిన ఎమోషన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన తల్లి శ్రీదేవి చనిపోయినట్టు తన కుటుంబం ఎదుర్కొన్న బాధలు, అవమానాలను వివరించింది. జాన్వీ మాట్లాడుతూ ‘ఆ సమయంలో మా కుటుంబ సభ్యులను మనుషుల్లా కూడా చూడలేదు. మమ్మల్ని ఏదోలా చూశారు. కొందరు మా మీద బురద జల్లాలని ప్రయత్నించారు. ఎవరూ సానుభూతి చూపలేదు. అమ్మను కోల్పోవడం మాకు వ్యక్తిగత విషాదం, కానీ కొందరికి అది కేవలం గాసిప్.. ఎంటర్‌టైన్‌మెంట్ అయింది. మా అమ్మ మరణాన్ని సెన్సేషనల్ న్యూస్‌లా చూపించడంతో తీవ్రంగా బాధపడ్డాం ” అని ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబం ఎదుర్కొన్న అవమానాలు, ఒత్తిడి

జాన్వీ మీడియా ప్రెజర్ గురించి కూడా చెప్పింది. ‘నేను నవ్వితే తప్పు, సైలెంట్‌గా ఉంటే మౌనంగా ఉందని కామెంట్స్ చేసేవారు. అమ్మ మరణం మాకు భరించలేని బాధ, కానీ కొందరికి అది ఒక వినోదం అయింది. ఆ సమయంలో మానసికంగా ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నానో చెప్పలేను’అని భావోద్వేగానికి లోనైంది.

నటి జాన్వీ తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ‘నా ప్రతి అడుగులో మా అమ్మ నా వెన్నంటి ఉండేది. నేడు నేను నటిగా ఇక్కడ నిలబడనంటే కారణం ఆ అమ్మే. అమ్మ ఇచ్చిన ప్రోత్సాహమే. తల్లిని కోల్పోయిన తర్వాత జీవితం ఖాళీగా అనిపించింది. కానీ అమ్మ నేర్పిన విలువలు, పాఠాలే నాకు ధైర్యం ఇచ్చాయి. ఆమె సంపాదించిన గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుకుంటాను.” అని పేర్కొన్నారు.

జాన్వీ కెరీర్ మరియు తల్లి ప్రభావం

శ్రీదేవీ మరణం తరువాత జాన్వీ కపూర్ తన తల్లి నటనా వారసత్వాన్ని కొనసాగిస్తుంది. వాస్తవానికి శ్రీదేవి మరణం తరువాత 2018లోనే జాన్వీ తొలి చిత్రం ‘ధడక్’ రిలీజ్ అయింది. ఆ సమయంలో తల్లి లేకుండా ముందుకు సాగడం తనకు ఎంతో క్లిష్టమైందని, బాధ నుంచి బయటపడేందుకు తాను పెద్ద యుద్ధం చేశానని జాన్వీ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను మానసికంగా కుంగిపోయినా, ప్రమోషన్లకు, మీడియా ఈవెంట్లకు హాజరుకావడంతో తనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకవచ్చారని గుర్తు చేసుకున్నారు.

జాన్వీ.. తాజాగా ‘పరమ్ సుందరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తన నటనతో మెప్పించింది. కానీ, సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. ఇక ప్రస్తుతం ఆమె ‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 2 న విడుదల కానుంది. ఇక టాలీవుడ్‌లో రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నది.

శ్రీదేవి మరణం తర్వాత జాన్వీ ఎదుర్కొన్న కష్టాలను, తన తల్లి నుండి పొందిన ప్రోత్సాహం తన జీవితంలో ఎంతో ప్రభావం చూపిందని జాన్వీ వెల్లడించింది. ఆమె తల్లి వారసత్వాన్ని కాపాడుకుంటానని తెలిపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.