|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Janki Bodiwala: ‘వాష్‌ రూమ్‌’ సన్నివేశంపై నటి షాకింగ్‌ కామెంట్స్‌

Published: 31-05-2025, 5:44 AM

గుజరాతీ హారర్ చిత్రం ‘వాష్’ లో నటించిన జాంకి బోడివాలా సినిమాలోని ఒక మూత్ర విసర్జన సన్నివేశం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దర్శకుడు ఆమెను నిజంగా మూత్ర విసర్జన చేయమని అడిగిన విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

జాంకి బోడివాలా 'వాష్' సినిమాలోని షాకింగ్ సన్నివేశం గురించి మాట్లాడారు.

2

దర్శకుడు నిజంగా మూత్ర విసర్జన చేయమని ఆమెను అడిగాడు.

3

సహజత్వం కోసం ఈ సన్నివేశం చిత్రీకరించబడింది.

4

చివరికి వేరే విధంగా సన్నివేశాన్ని చిత్రీకరించారు.

‘వాష్’ సినిమాలోని వివాదాస్పద సన్నివేశం

సినిమా సన్నివేశాల్లో సహజత్వం కోసం దర్శకులు పడే తాపత్రయంలో అద్భుతమైన కళాదృష్టి ఉంటే ఉండొచ్చు గాక..ఒక్కోసారి అది నటీనటులకు ప్రాణ సంకటంగా మారొచ్చు. ఎంత సహజత్వం కోసం తాపత్రయపడే ప్రేక్షకులైనా కొన్ని నిజజీవితంలో చేసే పనులు తెరమీద నేరుగా చూపిస్తే జుగుప్సాకరంగా ఫీల్‌ అవకుండా ఉండలేరు. అలాంటి వాటిలో వాష్‌ రూమ్‌ సన్నివేశాలు ముందు వరుసలో ఉంటాయి. అయితే అచ్చంగా అలాంటి ఒక సన్నివేశాన్ని చిత్రీకరించిన దర్శకుడు సహజత్వం కోసం సదరు నటిని చేయమన్న పని ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.

హిందీలో షైతాన్‌ గా రీమేక్‌ చేయబడిన గుజరాతీ హర్రర్‌ చిత్రం వాష్‌(Vash) లో నటించిన నటి జాంకి బోడివాలా(Janki Bodiwala) ఆ సినిమా లో సనిన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా తాను ఎదుర్కున్న అనుభవాలను నుంచి ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. ఇటీవల ఫిల్మ్‌ఫేర్‌తో జరిగిన రౌండ్‌టేబుల్‌ చర్చలో, ఆమె మాట్లాడుతూ వాష్‌  చిత్రంలోని ఒక కీలక సన్నివేశంలో తాను మూత్ర విసర్జన చేసే సీన్‌ ఉందన్నారు. అయితే ఆ సీన్‌ను రీమేక్‌ చేస్తున్న సమయంలో సహజత్వం కోసం దర్శకుడు కృష్ణదేవ్‌ యాగ్నిక్‌ నిజంగా మీరు మూత్ర విసర్జన చేయగలరా అని తనను అడిగినట్లు ఆమె వెల్లడించింది. సినిమాలో ఆ మూత్ర విసర్జన సన్నివేశం చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుందనీ కాబట్టి,   ఆ సీన్‌లో  నిజంగా ఆ పని చేయగలరా? అని దర్శకుడు అడిగినట్టు ఆమె తెలిపింది. అయితే ఆ మాటకి ముందు షాక్‌ తిన్నా… ఆ తర్వాత తాను చాలా ఉద్విగ్నంగా ఫీల్‌ అయ్యానని ఆమె చెప్పింది.  ఓహ్‌! నటుడిగా, నాకు తెరపై చేసే అవకాశం లభిస్తోంది. ఎవరూ చేయనిది.’’అంటూ సంతోషపడ్డానని వివరించింది.

జాంకి బోడివాలా అనుభవం

అయితే, వారు సన్నివేశాన్ని చిత్రీకరించడానికి సిద్ధమైన తర్వాత తనకి దర్శకుడు కోరుకున్న విధంగా చేయడం అసాధ్యం అనిపించిందని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సన్నివేశం తనను నటిగా ఉత్సాహపరిచింది కాబట్టి తాను చేయడానికి అంగీకరించానని వెల్లడించింది.  ‘‘కానీ తరువాత, అది  జరగలేదు మరియు దీనికి చాలా రీటేక్‌లు తీసుకున్నాం. ఇది సెట్‌లో ఆచరణాత్మకంగా సాధ్యం కాదని నాకు అర్ధమైంది. కాబట్టి మేము దానిని చేయడానికి వేరే మార్గాన్ని కనుగొన్నాం’’ అంటూ ఆమె తెలిపింది.  నిజ జీవితంలో తాను  చేయలేని పనులు చేయగలిగినందుకు  సంతోషంగా ఉన్నానని ఆ సన్నివేశం చేసినందుకు తను ఎలాంటి బాధ లేదని స్పష్టం చేసింది.

సహజత్వం కోసం చేసిన ప్రయత్నం

కనోడియా, నీలమ్‌ పాంచల్‌ హితేన్‌ కుమార్‌ నటించిన వాష్‌ చిత్రాన్ని హిందీలో అజయ్‌ దేవ్‌గన్, జ్యోతిక  ఆర్‌ మాధవన్‌లతో   షైతాన్‌గా రీమేక్‌ చేశారు.  ఒక రహస్యమైన అపరిచితుడు ఒక యువతిపై నియంత్రణ సాధించడం ద్వారా వారి ఇంట్లోని కుటుంబంపై ఎలా ప్రవర్తించాడు? అనే హారర్‌ కథ ఇది.  రెండు భాషా చిత్రాలలోనూ నటించిన జానకి అపరిచితుడి ఉచ్చులో పడే కుమార్తెగా ఆకట్టుకుంటుంది.

చివరికి, సన్నివేశాన్ని వేరే విధంగా చిత్రీకరించారు. ఈ ఘటన సినిమా షూటింగ్ లోని సవాళ్లను, సృజనాత్మకతను చూపుతుంది. జాంకి బోడివాలా నటనపై ఆమె నిబద్ధతను తెలియజేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.