
📌 Key Points
- జపాన్‌లో ఆదివారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
- సునామీ వచ్చే ప్రమాదం లేదని జపాన్ వాతావరణ సంస్థ స్పష్టం చేసింది.
- భూకంప కేంద్రం 41 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు, కొండచరియలు విరిగిపడే ప్రమాదంపై హెచ్చరికలు.
- గత నాలుగైదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10కి పైగా భూకంపాలు నమోదయ్యాయి.
భూకంపాలకు నిలయమైన జపాన్‌లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భూమి కంపించగా, సునామీ ప్రమాదం లేదని వాతావరణ సంస్థ ప్రకటించింది. అయితే, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
జపాన్‌లో భూకంప తీవ్రత
భూకంపాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో శక్తివంతమైన భూప్రకంపనలు వచ్చినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. దీనివల్ల సునామీ వచ్చే ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది. అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5.21 గంటల సమయంలో భూమి కంపించగా.. భూకంప కేంద్రం 41 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు పేర్కొంది. వరుస భూకంపాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. వాటికి సమీపంలో ఉన్న నివాసితులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కాగా.. గడిచిన నాలుగైదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 భూకంపాలు సంభవించాయి. జూన్ 24న వెనిజులాలో వరుస భూకంపాలు వచ్చాయి. 7.5, 7.2 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులవ్వగా.. వందలాదిమంది మరణించారు. అదే రోజున జపాన్ లో 6.9 తీవ్రతతో, ఉత్తర కాలిఫోర్నియాలో 5.6 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. జూన్ 26న 6.5 తీవ్రతతో ఫిలిప్పీన్స్ లో, 5.7 తీవ్రతతో జపాన్ లో, 5.2 తీవ్రతతో నికరాగ్వాలో భూమి కంపించింది. అలాగే జూన్ 27న 5.4 తీవ్రతతో పాకిస్తాన్ లో, జూన్ 28న 6.2 తీవ్రతతో ఆప్ఘనిస్తాన్, భారత్ లోని కశ్మీర్, ఢిల్లీలలో ప్రకంపనలు సంభవించాయి.
సునామీ ప్రమాదం లేదని స్పష్టం
ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు
ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జపాన్‌లో సునామీ హెచ్చరికలు లేకున్నా, ప్రకృతి విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు గుర్తుచేస్తున్నాయి.


