
యంగ్ హీరో సుధీర్ బాబు ‘జటాధర’ చిత్రంతో నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ డివోషనల్-హారర్ సినిమా నుండి తాజాగా రెండో రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
Key Points
సుధీర్ బాబు హీరోగా 'జటాధర' డివోషనల్-హారర్ చిత్రం నవంబర్ 7న రిలీజ్.
తాజాగా విడుదలైన రెండో ట్రైలర్ 'లంకె బిందెలున్నాయి' డైలాగ్‌తో ఆకట్టుకుంటోంది.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం.
వెంకటేశ్ కల్యాణ్-అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించింది.
జటాధర ట్రైలర్ హైలైట్స్
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా వస్తోన్న డివోషనల్ బ్యాక్ డ్రాప్ కథా చిత్రం ‘జటాధర'(JATADHARA Release Trailer). ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.
నటీనటులు, దర్శకులు, నిర్మాతలు
ఈ నేపథ్యంలో మరో ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి అనే డైలాగ్‌లో ట్రైలర్ ప్రారంభమైంది. దెయ్యాలు, భూతాలు అనే కాన్సెప్ట్‌తోనే ఈ మూవీని తీసినట్లు క్లియర్ కట్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి ఇలాంటి కాన్సెప్ట్ అభిమానులను అలరిస్తుందా? ఎప్పటిలాగే అలా వచ్చి ఇలా వెళ్లిపోతుందా? తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం రిలీజ్ ట్రైలర్ చూసేయండి.
సినిమా కథా నేపథ్యం, విడుదల
ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో మెప్పించనుంది.
‘జటాధర’ ట్రైలర్ దెయ్యాలు, భూతాల నేపథ్యంలో ఉత్కంఠ రేపుతోంది. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా నటనతో అలరించబోతున్న ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.


