
తమిళ హీరో జయం రవి భార్య ఆర్తి రవితో విడాకులు తీసుకున్నారు. ఈ విడాకులకు కారణంగా సింగర్ కెనీషా పేరు తెరపైకి వచ్చింది. రవి తన కొత్త ప్రాజెక్టులో కెనీషాను భాగస్వామిగా ప్రకటించాడు.
Key Points
జయం రవి భార్య ఆర్తి రవితో విడాకులు తీసుకున్నారు.
విడాకులకు కారణంగా సింగర్ కెనీషా పేరు వినిపిస్తోంది.
జయం రవి తన కొత్త బ్యానర్‌లో కెనీషాను భాగస్వామిగా ప్రకటించాడు.
రవి కెనీషాపై ప్రేమను వ్యక్తపరిచాడు, కెనీషా కళ్లలో నీళ్లు తిరిగాయి.
జయం రవి – ఆర్తి రవి విడాకులు
ఓపక్క భార్యకు విడాకులు.. మరోపక్క సింగర్‌తో రిలేషన్ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు తమిళ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి ( Ravi Mohan ). ఇతడు ఆర్తి రవిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. 15 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత దంపతులిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ విడాకులకు మూడో వ్యక్తికే కారణమని సంచలన ఆరోపణలు చేసింది ఆర్తి. ఆ మూడో వ్యక్తి మరెవరో కాదు, సింగర్ కెనీషా అంటూ ప్రచారం జరిగింది.
పార్ట్‌నర్‌షిప్ గుడికి వెళ్లినా, బయట పార్టీకి వెళ్లినా రవి, కెనీషా ( Kenishaa Francis ) జంటగా కనిపిస్తూ ఉండటంతో వీరిమధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని బలంగా నమ్ముతున్నారు. తాజాగా ఆమెపై తనకున్న ప్రేమను పరోక్షంగా చెప్పకనే చెప్పాడు రవి. తన సొంత బ్యానర్ రవి మోహన్ స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కెనీషాతో కలిసి వచ్చాడు. అంతే కాదు, తన బ్యానర్‌లో ఆమెను పార్ట్‌నర్‌గా ప్రకటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ఏకైక కారకురాలు కెనీషా! నా జీవితంలో తనలా ఇంతవరకు ఎవరూ సాయం చేయలేదు.
కెనీషాతో రిలేషన్ షిప్ రూమర్స్
కెనీషా ఎమోషనల్ జీవితంలో ఏమీ తోచని స్థితిలో చిక్కుకున్నప్పుడు భగవంతుడు మనకు ఏదో రకంగా సాయం చేస్తాడు. అలా నాకు ఆ దేవుడు పంపిన బహుమతి కెనీషా. నేనెవరు?అనేది నాకు తెలిసేలా చేసింది. రవి మోహన్ స్టూడియోలో కెనీషాకి కూడా భాగముంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి వ్యక్తి ఒకరుండాలని మనసారా కోరుకుంటున్నాను అన్నాడు. అతడి స్పీచ్ వింటున్నప్పుడు కెనీషా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది చూసిన జనాలు.. మీరు ప్రేమలో ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? అని కామెంట్లు చేస్తున్నారు.
జయం రవి ప్రకటన
జయం రవి మరియు కెనీషా మధ్య ఉన్న సంబంధంపై ప్రజలు అనేక అంచనాలు వేస్తున్నారు. ఈ సంఘటనలు తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.


