|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జయం రవి రెండో పెళ్లి… వివాదంగా మారిన ఫోటో !

Published: 05-06-2025, 3:14 PM
జయం రవి రెండో పెళ్లి... వివాదంగా మారిన ఫోటో !

సోషల్ మీడియాలో జయం రవి రెండో పెళ్లి గురించి వార్తలు వైరల్ గా వస్తున్నాయి. సింగర్ కెనీషాతో ఆయన పూలదండలు వేసుకున్న ఫోటోలు వివాదానికి దారితీశాయి. జయం రవి భార్య ఆర్తితో విడాకుల వివాదం నేపథ్యంలో ఈ వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Key Points

1

జయం రవి మరియు సింగర్ కెనీషా పూలదండలు వేసుకున్న ఫోటోలు వైరల్.

2

రెండో పెళ్లి అంటూ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి.

4

సినిమా షూటింగ్ సమయంలో దేవాలయంలో ప్రత్యేక పూజ అని వివరణ.

వైరల్ అవుతున్న ఫోటోలు

సౌత్ ఇండియా స్టార్ హీరో జయం రవి ( Jayam Ravi) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భార్యకు దూరంగా ఉంటున్న జయం రవి.. తాజాగా రెండో పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయింది. తాజాగా జయం రవి అలాగే సింగర్ కెనీషా (Singer Kenisha).. ఇద్దరూ పూలదండలు వేసుకుని కనిపించారు. వాళ్ళిద్దరి మెడలో పూల దండలు కనిపించడంతో… నిజంగానే రెండో పెళ్లి చేసుకున్నారని.. సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

విడాకుల వివాదం

తాజాగా చెన్నైలోని మురుగన్ దేవాలయంలో…సింగర్ కెనీషా అలాగే జయం రవి ఇద్దరూ మెరిసారు. ఈ సందర్భంగా ఇద్దరి మెడలో పూలదండలు కనిపించాయి. పక్కనే పురోహితులు కూడా ఉన్నారు. దీంతో వీళ్ళిద్దరికీ పెళ్లి అయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విడాకులు మంజూరు కాకుండానే జయం రవి రెండో పెళ్లి చేసుకున్నాడా ? ఇది నిజమేనా అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని మరి కొంతమంది చెబుతున్నారు.

నిజానిజాలు

ఓ సినిమా షూటింగ్ నేపథ్యంలో టెంపుల్ కి వెళ్ళగా…అక్కడ ప్రత్యేక పూజలు చేస్తే పూలదండలు వేశారట. అది రెండో పెళ్లి కాదని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా… తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు గత సంవత్సరం జయం రవి ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ తన భర్త నుంచి నెలకు 40 లక్షల మరణం ఇప్పించాలని.. తాజాగా కోర్టు మెట్లెక్కింది జయం రవి భార్య ఆర్తి. దీంతో వీళ్లిద్దరి విడాకులు అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో జయం రవి పూలదండలతో కనిపించడం హాట్ టాపిక్ అయింది.

జయం రవి మరియు కెనీషా ఫోటోల వెనుక నిజం ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియదు. వివాదం పరిష్కారం కోసం మరిన్ని వివరాల కోసం ఎదురు చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.