|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జయసుధతో ఏకంగా 70 సినిమాలు చేసిన ఏకైక హీరో ఎవరో తెలుసా? ఆ కోపరేషన్‌ వల్లే సాధ్యమైందంటూ కామెంట్‌

Published: 15-06-2025, 8:17 AM
జయసుధతో ఏకంగా 70 సినిమాలు చేసిన ఏకైక హీరో ఎవరో తెలుసా? ఆ కోపరేషన్‌ వల్లే సాధ్యమైందంటూ కామెంట్‌

ప్రముఖ నటి జయసుధ సినీ రంగంలో ఐదున్నర దశాబ్దాలుగా రాణిస్తోంది. ఎన్నో మంది హీరోలతో నటించిన జయసుధ, కృష్ణంరాజుతో అత్యధిక సినిమాలు చేసింది. వారి మధ్య అద్భుతమైన అనుబంధం ఉండేదని తెలుస్తోంది.

Key Points

1

జయసుధ 70కి పైగా సినిమాల్లో నటించారు.

2

కృష్ణంరాజుతో ఆమెకు అద్భుతమైన జంటగా పేరుంది.

4

కృష్ణంరాజు వారి కాంబినేషన్‌ సినిమాలను ఎంతగానో ఇష్టపడేవారు.

జయసుధ సినీ జీవితం

సహజనటి జయసుధ ఐదున్నర దశాబ్దాలుగా సినిమా రంగంలో నటిగా రాణిస్తోంది. స్టార్‌ హీరోయిన్‌గా అలరించింది. సహజమైన నటనతో ఆకట్టుకుని ఏకంగా `సహజనటి` అనే బిరుదుని సొంతం చేసుకుంది.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ నుంచి, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి మొదటి రెండు తరాల నటులకు జోడీగా చేసి అలరించింది జయసుధ. ఇప్పటికీ అంతే సహజమైన నటనతో మెప్పిస్తూనే ఉంది. హీరోలకు, హీరోయిన్లకి అమ్మ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటుంది.

అయితే చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. తాజాగా ఆమె తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్ అవార్డుల జ్యూరీకి చైర్మెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

జయసుధ.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌ బాబు, కృష్ణలతో కలిసి నటించింది. మంచి విజయాలు అందుకుంది. కానీ వారితోపాటు కృష్ణంరాజుతోనూ ఎక్కువగా సినిమాలు చేసింది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్‌లో ఆమె అత్యధికంగా సినిమాలు చేసింది కృష్ణంరాజుతోనే కావడం విశేషం.

వీరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీస్‌ కూడా మంచి విజయం సాధించాయి. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఈ ఇద్దరు కలిసి సినిమాలు చేయడంతో అనేక రూమర్లు కూడా వచ్చాయి. వెండితెరపై వీరిని చూస్తే ఆడియెన్స్ నిజంగానే వీరిద్దరు కపుల్‌ అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

కృష్ణంరాజుతో జయసుధ కాంబినేషన్‌

ఏడాదికి వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలే రెండు మూడు ఉండేవి. అంతగా జయసుధ, కృష్ణంరాజులు కలిసి నటించారు. అదే సమయంలో అంతే బాగా వీరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది.

తమ కాంబినేషన్‌పై కృష్ణంరాజు ఓపెన్‌ అయ్యారు. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే షోలో ఆయన మాట్లాడుతూ, జయసుధతో కాంబినేషన్‌ సినిమాలను ఆయన ఎక్కువగా ఇష్టపడేవారట. ఆమెతో ఏకంగా 70-80 సినిమాలు చేసినట్టు తెలిపారు రెబల్‌ స్టార్‌.

తాను చాలా మంది హీరోయిన్లతో పనిచేసినట్టు చెప్పిన కృష్ణంరాజు, తనతో పోటీగా ఎవరూ నటించేవారు కాదన్నారు. దీంతో తానే తగ్గాల్సి వచ్చిందట. కానీ జయసుధ విషయంలో అలాంటి సమస్య వచ్చేది కాదని, తనకు పోటీగా చేసేదని చెప్పారు కృష్ణంరాజు.

అంతేకాదు సీన్లు బాగా చేసేందుకు ఇద్దరు కోపరేట్‌ చేసుకునేవారట. అలా ఇద్దరూ పోటీ పడీ నటించేవారట. ఇద్దరి మధ్య అంతటి మంచి అనుబంధం ఉందని తెలిపారు కృష్ణంరాజు.

అలా కృష్ణంరాజు, జయసుధ టాలీవుడ్‌లో బెస్ట్ పెయిర్‌గా నిలిచారు. ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించారు. ఈ ఇద్దరు కలిసి `కళ్యాణ చక్రవర్తి`, `నేటి యుగ ధర్మం`, `జగ్గు`, `కోటి కొక్కడు`, `అగ్గిరాజు`, `పృథ్వీరాజ్‌`, `మాఇంటి మహారాజు`, `భరతంలో శంఖరావం`, `మరణ శాసనం`,

వారి మధ్య అద్భుతమైన అనుబంధం

`అమరదీపం`, `రామలక్ష్మణులు`, `ఆడవాళ్లు మీకు జోహార్లు`, `గువ్వల జంట`, `నిప్పుతో చెలగాటం`, `యుద్ధం`, `అల్లుడు పట్టిన భరతం`, `తిరుగుబాటు`, `జీవన తీరాలు`, `సర్దార్‌ ధర్మన్న`, `శివ మెత్తిన సత్యం`, `అగ్నిపూలు`, `మధుర స్వప్నం`, `సింహస్వప్నం`, `ప్రేమతరంగాలు`, `ధర్మాంత్ముడు`,

`కటకటాల రుద్రయ్య`, `జైలర్‌ గారి అబ్బాయి, `కిరాయి దాదా`, `బొబ్బిలి బ్రహ్మన్న`, `తాండ్ర పాపారాయుడు`, `త్రిశూలం`, `భావబావమరిది`, `బిల్లా` వంటి సినిమాల్లో నటించి అలరించారు. తిరుగులేని హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు.

కృష్ణంరాజు రెబల్‌ స్టార్‌గా రాణించారు. ఆవేశంతో కూడిన పాత్రలు, తిరుగుబాటుతో కూడిన పాత్రలు చేసి ఆయన రెబల్‌ స్టార్‌ ట్యాగ్‌ని సొంతం చేసుకున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ తర్వాత ఆ స్థాయిలో హీరోగా మెప్పించారు. యాక్షన్‌ సినిమాలతో అలరించారు.

కేవలం యాక్షన్‌ చిత్రాలే కాదు, ఫ్యామిలీ చిత్రాలు కూడా చేసి ఆకట్టుకున్నారు. హీరోగానే కాదు, కొన్ని చిత్రాల్లో నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలు కూడా చేసి అదరగొట్టారు. టాలీవుడ్‌లో లెజెండరీ యాక్టర్స్ లో ఒకరిగా నిలిచారు. ఆయన వారసత్వాన్ని ఇప్పుడు ప్రభాస్‌ కొనసాగిస్తున్నారు.

తన తమ్ముడు సూర్యనారాయణరాజు తనయుడు ప్రభాస్‌. ఇక అనారోగ్యంతో కృష్ణంరాజు మూడేళ్ల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. చివరగా కృష్ణంరాజు.. ప్రభాస్‌ హీరోగా రూపొందిన `రాధేశ్యామ్‌` చిత్రంలో నటించారు. ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది.

జయసుధ, కృష్ణంరాజుల కాంబినేషన్ టాలీవుడ్‌లో ఒక మైలురాయి. వారి సహకారం, నటన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దారితీసింది. వారి జంట సినిమాలు ప్రేక్షకులను ఎప్పటికీ ఆకట్టుకుంటాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.