|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జీవనజ్యోతి @ 50 ఇయర్స్‌

Published: 15-05-2025, 2:52 PM
జీవనజ్యోతి @ 50 ఇయర్స్‌

1973 వేసవిలో విడుదలైన ‘జీవనజ్యోతి’ సినిమా నేటితో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. వాణిశ్రీ, శోభన్ బాబు నటించిన ఈ చిత్రం కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సందర్భంగా సినిమా గురించి ఒక ప్రత్యేక కథనం.

Key Points

1

వాణిశ్రీ అద్భుతమైన నటనతో ‘జీవనజ్యోతి’ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది.

2

50 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.

4

కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక కుటుంబ కథ.

యాభై ఏళ్ల జీవనజ్యోతి

సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం… మండు వేసవి. దాదాపు 113 డిగ్రీల ఫారెన్‌హీట్‌ ఉష్ణోగ్రతతో బెజవాడ అక్షరాలా ‘బ్లేజ్‌వాడ’గా ఠారెత్తిస్తోంది. వడగాడ్పులు, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఆ పరిస్థితుల్లో వాణిశ్రీ ప్రధానపాత్రలో, శోభన్‌బాబు హీరోగా, బేబీ వరలక్ష్మి చిన్నారి బాబు పాత్రలో కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో, డి.వి.ఎస్‌. రాజు నిర్మించిన ‘జీవనజ్యోతి’ చిత్రం రిలీజైంది.

వాణిశ్రీ అద్భుతమైన నటన

ఫస్టాఫ్‌లో అల్లరిపిల్లగా కనిపించి, సెకండాఫ్‌లో పోగొట్టుకున్న తన బాబు కోసం ఆరాటపడే మతి భ్రమించిన మాతృమూర్తిగా కన్నీళ్ళు పెట్టించే లక్ష్మి పాత్రపోషణలోని రెండు విభిన్న ఛాయలను వాణిశ్రీ అద్భుతంగా అభినయించారు. ఆ సెంటిమెంటల్‌ కుటుంబ కథ ఆ మండుటెండల్లోనే బాక్సాఫీస్‌ మలయమారుతమైంది. సిల్వర్‌జూబ్లీ సూపర్‌హిట్‌గానే కాక, ఆ ఏడాది అత్యధిక వసూళ్ళు సాధించిన అరుదైన చిత్రంగా చరిత్రకెక్కింది.

బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్

‘ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు…’, ‘సిన్ని ఓ సిన్నీ…’, ‘ఎందుకంటే ఏమి చెప్పను…’ అలాంటి సూపర్‌హిట్‌ పాటలున్న మ్యూజికల్‌ హిట్‌ చిత్రానికి నేటితో 50 ఏళ్ళు. ఈ సందర్భంగా రెంటాల జయదేవ ప్రత్యేక కథనం… ‘బాక్సాఫీస్‌ సెంటిమెంట్‌ బంగారం… జీవనజ్యోతి’… ఇవాళ్టి ‘సాక్షి… సినిమా ప్లస్‌’ ఇ–పేపర్‌లో!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.