|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జిగ్రీస్ రివ్యూ.. రూపాయి లేకుండా నలుగురి ఫ్రెండ్స్ గోవా ట్రిప్.. సందీప్ రెడ్డి వంగా స్నేహితుడి మూవీ ఎలా ఉందంటే?

Published: 13-11-2025, 4:17 AM
జిగ్రీస్ రివ్యూ.. రూపాయి లేకుండా నలుగురి ఫ్రెండ్స్ గోవా ట్రిప్.. సందీప్ రెడ్డి వంగా స్నేహితుడి మూవీ ఎలా ఉందంటే?

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్నేహితుడు నిర్మించిన ‘జిగ్రీస్’ సినిమా రివ్యూ ఇక్కడ ఉంది. రూపాయి లేకుండా గోవా వెళ్లిన నలుగురు స్నేహితుల కథతో సాగే ఈ కామెడీ మూవీ ఎలా ఉంది? నటీనటుల ప్రదర్శన, నవ్వించిన, ఏడిపించిన సన్నివేశాలు ఏంటి? తెలుసుకుందాం.

Key Points

1

సందీప్ రెడ్డి వంగా స్నేహితుడు కృష్ణ వోడపల్లి నిర్మించిన లేటెస్ట్ కామెడీ మూవీ.

2

రూపాయి లేకుండా నలుగురు ఫ్రెండ్స్ గోవాకు వెళ్లడం, ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రధాన కథాంశం.

4

చివరి 15 నిమిషాలు గుండె బరువెక్కించే ఎమోషనల్ ఎపిసోడ్‌తో కన్నీళ్లు తెప్పిస్తాయి.

జిగ్రీస్ కథా నేపథ్యం

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఫ్రెండ్ కృష్ణ వోడపల్లి నిర్మించిన లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ జిగ్రీస్. మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్, కృష్ణ బూరుగుల, ధీరజ్ ఆత్రేయ, మని వాక ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రీమియర్ షోలను ఒకరోజు ముందుగానే వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి జిగ్రీస్ రివ్యూలో తెలుసుకుందాం.

నటీనటులు: కృష్ణ బూరుగుల, రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మని వాక తదితరులు

కథ, దర్శకత్వం: హరీష్ రెడ్డి ఉప్పుల

సినిమాటోగ్రఫీ: ఈశ్వరాదిత్య

నటీనటుల అద్భుత ప్రదర్శన

ఎడిటింగ్: చాణక్య రెడ్డి తూరుపు

విడుదల తేది: నవంబర్ 14, 2025

మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్, కృష్ణ బూరుగుల, ధీరజ్ ఆత్రేయ, మని వాక ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ కామెడీ ఫిల్మ్ జిగ్రీస్. ఈ సినిమాను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్నేహితుడు కృష్ణ వోడపల్లి నిర్మించారు. దీంతో ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే గత కొంతకాలంగా సోషల్ మీడియా లో జిగ్రీస్ అట్రాక్ట్ చేస్తుంది.

దారిలో కారు రిపేర్‌కు వస్తుంది. అప్పుడు డబ్బు పోగొట్టుకున్నామని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? నలుగురు ఫ్రెండ్స్ ఒక్క రూపాయి లేకుండా గోవాకు ఎలా వెళ్లారు? ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటీ? అసలు రాత్రికి రాత్రే గోవాకు వెళ్లాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? ఆ మారుతి 800 కారులోనే ఎందుకు వెళ్లాలనుకున్నారు? గోవా ప్రయాణం నలుగురిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? ప్రశాంత్‌కు ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే జిగ్రీస్ చూడాల్సిందే.

నవ్వించిన, ఏడిపించిన సన్నివేశాలు

ఇందులో నలుగురు ఫ్రెండ్స్ ఎంటర్‌టైన్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఒక్కో సీన్ కామెడీతో బాగా నవ్వించేలా ఉంది. ముఖ్యంగా లారీ సీన్, ఓ ఊర్లో నాటుకోడి ఎపిసోడ్, కండోమ్ సీన్స్ వంటివి హాయిగా నవ్విస్తాయి. కథలో మావోయిస్టుల బ్లాక్ రావడం, అది మెప్పించే తీరు బాగుంది.

ఇక ఫినిషింగ్ టచ్ కింద చివరి 15 నిమిషాలు గుండె బరువెక్కించేలా ఎమోషనల్ ఎపిసోడ్ కన్నీళ్లు తెప్పిస్తుంది. అప్పటి వరకు నవ్వించిన పాత్రలు ఏడిపించేస్తాయి. క్లైమాక్స్ భావోద్వేగం తెప్పించేలా ఉంటుంది. ఇకపోతే నలుగురి యాక్టింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా కృష్ణ బూరుగుల పర్ఫామెన్స్ మొదటి నుంచి చివరి వరకు మెప్పిస్తుంది.

రామ్ నితిన్ తన స్టైల్‌లో ఆకట్టుకున్నాడు. ధీరజ్ ఆత్రేయ నాచురల్‌గా అమాయకపు యాక్టింగ్‌తో నవ్వించాడు. మని వాక పాత్ర చుట్టూనే సినిమా సాగుతుంది. ఎమోషనల్ సీన్స్‌లో పర్లేదనిపించాడు. ఇక నలుగురు ఫ్రెండ్స్‌తో కామెడీ, ఎమోషనల్‌గా మెప్పిచడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. విజువల్స్ నాచురల్‌గా బాగున్నాయి.

మొత్తంగా, జిగ్రీస్ సినిమా కామెడీతో పాటు భావోద్వేగాలను పంచుతుంది. స్నేహం విలువను చక్కగా చూపించి, నవ్విస్తూనే కంటతడి పెట్టిస్తుంది. ఒక మంచి వీకెండ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని చూడవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.