|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైవిధ్యభరితమైన కథతో ‘జిన్’

Published: 11-12-2025, 12:48 PM
వైవిధ్యభరితమైన కథతో ‘జిన్’
  • ‘జిన్’ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా డిసెంబర్ 19న విడుదల కానుంది.
  • చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించగా, అమిత్ రావ్ హీరోగా నటించారు.
  • సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మించారు.
  • పోస్టర్స్, వీడియోలకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్.

వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ‘జిన్’ అనే సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సిద్ధమవుతోంది. డిసెంబర్ 19న విడుదల కానున్న ఈ చిత్రంలో అమిత్ రావ్ హీరోగా, చిన్మయ్ రామ్ దర్శకుడిగా వ్యవహరించారు. పోస్టర్లు, వీడియోలకు మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘జిన్’ కథా నేపథ్యం, జానర్

కథలో స్టఫ్ ఉండాలే గానీ, కొత్త నటీనటులైనా సరే సినిమా సూపర్ సక్సెస్ అవుతోంది. సరిగ్గా అదే ఫార్ములాను తీసుకొని ఓ డిఫరెంట్ జానర్‌లో ‘జిన్’ అనే ఓ సరికొత్త సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు మేకర్స్. డైరెక్టర్ చిన్మయ్ రామ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. ఈ సినిమాలో అమిత్ రావ్ హీరోగా నటిస్తుండగా.. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకొచ్చిన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి. మంచి హైప్ రావడంతో ఈ చిత్రాన్ని తెలుగులో డిసెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

ఈ చిత్రంలో పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్రాజ్ వాడి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అలెక్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు జిన్ అనే టైటిల్ ప్లస్ పాయింట్. కథే కాదు టైటిల్‌లో కూడా వైవిద్యం ఉండటంతో ఈ సినిమా సులువుగా ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా కథకు యాప్ట్ అయ్యే పలు లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ చేశారు. ఖర్చుకు నిర్మాతలు ఎక్కడా వెనక్కి తగ్గలేదని.. స్ట్రాంగ్ కంటెంట్, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుందని.. మూవీ సూపర్ సక్సెస్ కావడం పక్కా అని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది.

నటీనటులు, సాంకేతిక బృందం

విడుదల తేదీ, అంచనాలు

నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా బలమైన కంటెంట్‌తో రూపొందించిన ‘జిన్’ సినిమా విజయవంతం అవుతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎలాంటి స్పందన పొందుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.