|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి తెలుగులో తమిళ హారర్ థ్రిల్లర్ ‘జిన్ ది పెట్’.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్.. 8 నుంచి పడిపోయిన రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

Published: 31-07-2025, 11:24 AM
ఓటీటీలోకి తెలుగులో తమిళ హారర్ థ్రిల్లర్ 'జిన్ ది పెట్'.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్.. 8 నుంచి పడిపోయిన రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

తమిళంలో విడుదలై విజయవంతమైన ‘జిన్ ది పెట్’ సినిమా ఇప్పుడు తెలుగులో ఓటీటీలో విడుదలవుతోంది. 8 రేటింగ్‌తో ప్రారంభమైన ఈ సినిమా రేటింగ్ ఇప్పుడు పడిపోయినప్పటికీ, హారర్ ప్రేమికులను ఆకట్టుకునే అంశాలున్నాయి.

Key Points

1

తమిళ హారర్ థ్రిల్లర్ 'జిన్ ది పెట్' తెలుగులో ఓటీటీలోకి రానుంది.

2

ఆగస్ట్ 1, అర్ధరాత్రి 12 గంటలకు సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ ప్రారంభం.

4

హారర్ థ్రిల్లర్స్ అభిమానులు ఈ సినిమాను తప్పకుండా చూడాలి.

జిన్ ది పెట్: తెలుగు ఓటీటీ విడుదల

ఓటీటీ ఆడియెన్స్‌ను ఎక్కువగా కట్టిపడేసే సినిమా జోనర్లలో హారర్ ఒకటి. ఈ హారర్ థ్రిల్లర్ జోనర్స్‌కు కామెడీ, అడల్ట్, యాక్షన్, ఫాంటసీ, సైకలాజికల్ వంటి వివిధ ఎలిమెంట్స్‌ను యాడ్ చేసి తెరకెక్కిస్తుంటారు దర్శకనిర్మాతలు. మనుషుల్లో కామన్ అంశమైన భయం మీద వచ్చే ఈ సినిమాలు దాదాపుగా మంచి ఆదరణ దక్కించుకుంటాయి.

ఇప్పటికీ సౌత్, హిందీ భాషల్లో ఎన్నో హారర్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. వాటిలో డిఫరెంట్ స్టోరీ తో తమిళంలో తెరకెక్కిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ సినిమానే జిన్ ది పెట్. తమిళంలో మే 30న థఇయేటర్లలో విడుదలైన జిన్ ది పెట్ సినిమాకు టాక్ అంతంత మాత్రంగానే వచ్చింది. కానీ, రేటింగ్ మాత్రం ఎంతో సాధించుకుంది.

రిలీజ్ తేదీ మరియు సమయం

ఐఎమ్‌డీబీ సంస్థలో పదికి ఏకంగా 8 రేటింగ్‌ను సొంతం చేసుకుంది జిన్ ది పెట్. అలాంటి జిన్ ఆ వెంటనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన నెల రోజులకు అంటే జూన్ 20న తమిళంలో జిన్ ది పెట్ ఓటీటీ రిలీజ్ అయింది. మొన్నటివరకు తమిళ వెర్షన్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ అయిన జిన్ ఇప్పుడు తెలుగులోకి వచ్చేస్తోంది.

సన్ నెక్ట్స్‌లో తమిళంలో జిన్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇప్పుడు అదే సన్ నెక్ట్స్‌లోనే తెలుగు భాషలో జిన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అంటే, రేపటి (ఆగస్ట్ 1) నుంచి సన్ ఎన్ఎక్స్‌టీలో జిన్ ది పెట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఆగస్ట్ 1 అర్థరాత్రి 12 గంటల సమయంలోనే జిన్ ఓటీటీ రిలీజ్ కానుంది.

రేటింగ్‌లో పడిపోతూ..

అయితే, థియేట్రికల్ రిలీజ్ సమయంలో జిన్ మూవీ పదికి 8 రేటింగ్ సాధించుకోగా.. ఇప్పుడు మాత్రం కేవలం 4.2 రేటింగ్‌ను మాత్రమే నమోదు చేసుకుంది. అంటే, ఈ మధ్య కాలంలో జిన్ ది పెట్ సినిమాకు వచ్చిన రేటింగ్ అది. ప్రస్తుతం 8 నుంచి ఏకంగా సగం వరకు జిన్ రేటింగ్ పడిపోయినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు జిన్ ది పెట్ మూవీని సన్ నెక్ట్స్‌ ఓటీటీ లో తెలుగులో ఎంచక్కా చూసేయొచ్చు. ఇకపోతే జిన్ ది పెట్ సినిమాకు టీఆర్ బాల కథ, దర్శకత్వం వహించారు. జిన్ ది పెట్ సినిమా ముగేన్ రావ్, భవ్య త్రిఖ హీరో హీరోయిన్స్‌గా నటించారు.

తెలుగు ప్రేక్షకులకు ‘జిన్ ది పెట్’ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. హారర్ ప్రేమికులు ఈ సినిమాను తప్పక చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.