
📌 Key Points
- ఎయిర్‌టెల్ రూ. 195 ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీతో 12GB డేటా, 3 నెలల హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.
- జియో రూ. 195 ప్లాన్‌లో 90 రోజుల వ్యాలిడిటీతో 15GB డేటా, 90 రోజుల హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.
- Vi రూ. 151 ప్లాన్‌లో 90 రోజుల వ్యాలిడిటీతో 4GB డేటా, 3 నెలల హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది.
- ఎయిర్‌టెల్ రూ. 361 ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీతో 50GB డేటా, 3 నెలల హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు శుభవార్త! ఇప్పుడు మీరు తక్కువ ధరకే 50GB వరకు డేటాతో పాటు 3 నెలల పాటు ఉచితంగా హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఆ ప్లాన్‌లేంటో చూద్దాం.
ఎయిర్‌టెల్ చీపెస్ట్ ప్లాన్స్ వివరాలు
JioHotstar : జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా మీ నెట్ వర్క్ ఏదైనా ఈ చీపెస్ట్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 50GB డేటాతో పాటు 3 నెలల వరకు జియోహాట్ స్టార్ యాక్సస్ చేయొచ్చు. అది ఎలాగంటే?
JioHotstar : మీకు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉందా? లేదంటే ఇప్పుడే తీసుకోండి. మీ నెట్ వర్క్ ఏదైనా సరే మూడు నెలల పాటు ఉచితంగా జియోహాట్ స్టార్ పొందవచ్చు. జియోహాట్ స్టార్‌లో సినిమాలు, షోలు అన్ని చూడొచ్చు. 3 నెలల పాటు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఎలా పొందాలో తెలుసా? మీరు ముందుగా మీ మొబైల్ నెట్ వర్క్ నుంచి ఏదైనా ఒక రీఛార్జ్ ప్లాన్ తీసుకోవాలి.
ప్రస్తుతం మార్కెట్లో 3 నెలల ఫ్రీ (JioHotstar)తో వచ్చే కొన్ని సరసమైన రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే 50GB వరకు డేటా, 3 నెలల వరకు జియోహాట్‌స్టార్ యాక్సస్ పొందవచ్చు. మీరు కూడా ఈ రీఛార్జ్ ప్లాన్లలో ఏది కావాలో ఎంచుకోండి.
జియో బెస్ట్ డేటా ప్లాన్స్
ఎయిర్‌టెల్ రూ. 195 డేటా ప్యాక్ : ఈ డేటా ప్యాక్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 12GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ (3 నెలలు), ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్ (20+ OTT ఛానెల్‌లు) ఉన్నాయి.
ఎయిర్‌టెల్ రూ. 361 డేటా ప్యాక్ : ఈ డేటా ప్యాక్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 50GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ (3 నెలల పాటు) అందిస్తుంది.
Read Also : Upcoming 5G Phones : కొత్త 5G ఫోన్ కావాలా? ఈ వారంలో రాబోయే అద్భుతమైన 5జీ స్మార్ట్‌ఫోన్లు.. మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా?
Vi హాట్‌స్టార్ ఉచిత ప్లాన్స్
జియో రూ. 195 డేటా ప్యాక్ : ఈ డేటా ప్యాక్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 15GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ జియోహాట్‌స్టార్ మొబైల్/టీవీ సబ్‌స్క్రిప్షన్ (90 రోజుల పాటు) ఉంటుంది.
వోడాఫోన్ ఐడియా రూ. 151 డేటా ప్యాక్ : ఈ డేటా ప్యాక్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 4GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ (3 నెలలు) ఉంటుంది.
వోడాఫోన్ ఐడియా రూ. 169 డేటా ప్యాక్ : ఈ డేటా ప్యాక్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 8GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ (90 రోజులు) ఉంటుంది.
ఈ ప్లాన్‌ల ద్వారా తక్కువ ధరకే ఎక్కువ డేటాను, ఉచిత హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మీ అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్‌ను ఎంచుకుని ఆనందించండి.


