
అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ కీలక పాత్రల్లో నటించిన ‘జాలీ ఎల్ఎల్‌బీ 3’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ లీగల్ కామెడీ చిత్రం నవంబర్ 14 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా కథాంశం, నటీనటుల వివరాలు ఈ కథనంలో.
Key Points
జాలీ ఎల్ఎల్‌బీ 3 నవంబర్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.
అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రల్లో నటించారు.
దర్శకుడు సుభాష్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన మూడో భాగం ఇది.
రైతుల భూములను కాపాడటానికి జాలీలు చేసిన ప్రయత్నమే ఈ సినిమా.
జాలీ ఎల్ఎల్‌బీ 3: ఓటీటీ రిలీజ్ డేట్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా అల తెలుసు కదా, కె ర్యాంప్, డ్యూడ్ లాంటి హిట్ చిత్రాలు రాబోతున్నాయి. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు లిస్టులో లేటెస్ట్ హిందీ మూవీ ఒకటి చేరింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ లీగర్ కామెడీ చిత్రం ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని అనౌన్స్ చేశారు. ఇంతకీ ఎప్పటినుంచి ఎందులో చూడొచ్చు?
సినిమా కథాంశం: రైతులు, న్యాయం కోసం జాలీలు
గతంలో వచ్చిన జాలీ ఎల్ఎల్‌బీ, జాలీ ఎల్ఎల్‌బీ 2 సినిమాలకు కొనసాగింపుగా ఈ ఏడాదా సెప్టెంబరు 19న మూడో భాగం వచ్చింది. ఇందులో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి ప్రధాన పాత్రలు చేశారు. తొలి రెండు చిత్రాల్ని తీసిన సుభాష్ కపూర్.. దీన్ని కూడా డైరెక్ట్ చేశారు. 2011లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వారం ప్రారంభంలోనే నవంబరు 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రావొచ్చని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశముంది.
అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ నటన, చిత్ర నేపథ్యం
‘జాలీ ఎల్ఎల్‌బీ 3’ విషయానికొస్తే.. రాజస్థాన్‌లోని బికనీర్ గ్రామంలో ఓ ధనవంతుడైన పారిశ్రామికవేత్త హరి భాయ్ (గజరాజ్) చేసిన ఓ ప్రయత్నాన్ని ఊరిలోని వ్యవసాయదారులందరూ వ్యతిరేకిస్తారు. ప్రభుత్వాధికారులు తన చేతిలో ఉండేసరికి హరి భాయ్.. మతలబు చేసి రైతుల భూముల్ని తన సొంతం చేసుకుంటాడు. న్యాయం కోసం కోర్టుని ఆశ్రయించిన రైతులకు.. ఇద్దరు జాలీలు (అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ) ఎలాంటి సాయం చేశారు? చివరకు ఏమైందనేదే ఈ సినిమా స్టోరీ. తొలిరోజు చిత్రాలతో పోలిస్తే ఇది ఓ మాదిరి స్పందన మాత్రమే అందుకుంది. పెద్దగా కలెక్షన్స్ కూడా రాలేదు.
‘జాలీ ఎల్ఎల్‌బీ 3’ చిత్రం నవంబర్ 14 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ ఆసక్తికరమైన లీగల్ కామెడీ డ్రామాను మీ ఇంట్లో కూర్చునే ఆస్వాదించండి.


