|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Jr NTR: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూ. ఎన్టీఆర్.. కారణమేంటంటే..

Published: 08-12-2025, 7:48 AM
Jr NTR: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూ. ఎన్టీఆర్.. కారణమేంటంటే..
  • జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
  • అనుమతి లేకుండా తన ఫోటోలు, పేరు వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
  • ఐటీ నిబంధనలు 2021 ప్రకారం మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
  • చిరంజీవి, నాగార్జున వంటి హీరోలు కూడా గతంలో ఇలాగే కోర్టును ఆశ్రయించారు.

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలను వాడకూడదని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు సానుకూలంగా స్పందించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చిరంజీవి, నాగార్జున బాటలో తారక్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్: వ్యక్తిత్వ హక్కుల రక్షణ

Jr NTR Approch Delhi HC: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కోర్టు ఆశ్రయించారు. వ్యక్తిత్వ హక్కులు ( personality rights ) రక్షణలో భాగంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండ పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, ఈకామర్స్ వెబ్ సైట్లు తన ఫోటోలు వాడుకుకుంటున్నాయి , అనధికారికంగా తన ఫోటోలు , పేరు వాడకుండ ఆదేశాలు ఇవ్వాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ మేరకు ఎన్టీఆర్ పిటిషన్ పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఆయన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని పేర్కొంది. అలాగే ఐటీ నిబంధనలు 2021 ప్రకారం మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియా, ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌పై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇక తదుపతి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసి సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా వెల్లడించారు.

ఎన్టీఆర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

నాగార్జున, చిరంజీవి బాటలోనే

చిరంజీవి, నాగార్జున బాటలో జూనియర్ ఎన్టీఆర్

కాగా తమ వ్యక్తిగత రక్షణ కోసం టాలీవుడ్ అగ్ర హీరోలు అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవిలు సైతం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండ పేరు, ఫోటోలు , వీడియోలు ఉపయోగించడం, ట్రోల్ చేయడం లాంటివి చేయకూడని హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు వారి బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆదేశాల మేరకు ఇకపై ఎన్టీఆర్ ఫోటోలు , పేరు అనధికారికంగా ఉపయోగిస్తే వారిపై చర్యలు తప్పవు . కాగా ప్రస్తుతం తారక్.. ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల రక్షణకు ఒక ముఖ్యమైన అడుగు. ఈ ఆదేశాలతో భవిష్యత్తులో అనధికారిక వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.