
యాడ్ షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. అయితే, గాయాలు తీవ్రంగా లేవని, రెండు వారాల విశ్రాంతి తీసుకోనున్నట్లు ఆయన టీమ్ తెలిపింది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
Key Points
యాడ్ షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కి స్వల్ప గాయాలు
రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు
యాడ్ షూట్‌లో ప్రమాదం
టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గాయాలయ్యాయి. ఓ యాడ్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అతని టీమ్ కూడా ఈ వార్తలను కన్ఫమ్ చేసింది. అయితే ఈ గాయాలేమీ అంత పెద్దవి కాదని స్పష్టం చేసింది. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపింది.
జూనియర్ ఎన్టీఆర్ యాడ్ షూటింగ్ సందర్భంగా కింద పడినట్లు తెలిసింది. దీంతో అతనికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని అతని టీమ్ కూడా ధృవీకరించింది. అయితే ఇదేమంత పెద్ద ప్రమాదం కాదని తేలడంతో అతని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఓ ప్రకటన కూడా జారీ చేసింది. “ఓ యాడ్ షూటింగ్ లో మిస్టర్ ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డాడు. డాక్టర్ల సలహా మేరకు పూర్తిగా కోలుకోవడానికి వచ్చే రెండు వారాల పాటు అతడు విశ్రాంతి తీసుకోనున్నాడు. అతని పరిస్థితి నిలకడగానే ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఎలాంటి పుకార్లు వ్యాపింజేయ వద్దని ఫ్యాన్స్, మీడియా, ప్రజలను కోరుతున్నాం” అని అందులో ఉంది.
రెండు వారాల విశ్రాంతి
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ మూవీ షూటింగ్ గ్యాప్ లో యాడ్ షూటింగ్ లో అతడు బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది.
జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యే వార్ 2 మూవీలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ లో అతడు బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసమే అతడు పూర్తిగా స్లిమ్ లుక్ లోకి మారిపోయాడు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందులో అతడు చాలా సన్నగా కనిపించాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంతో బొద్దుగా ఉన్న అతడు.. యమదొంగ మూవీ సమయంలో ఇలాగే సన్నగా మారిపోయాడు. మళ్లీ కాస్త లావెక్కినా.. ఇప్పుడు మరోసారి చాలా సన్నగా కనిపించి ఆశ్చర్య పరుస్తున్నాడు. అయితే అతని బైసెప్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అతడు వాటిపైనే ఎక్కువగా వర్కౌట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రశాంత్ నీల్ సినిమా
యూఎస్ కాన్సులేట్‌లో తారక్
అంతేకాదు గత మంగళవారం (సెప్టెంబర్ 16) తారక్ యూఎస్ కాన్సులేట్ కు కూడా వెళ్లాడు. ఈ విషయాన్ని యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ తన అఫీషియల్ అకౌంట్ ద్వారా వెల్లడించడం విశేషం. “కాన్సులేట్‌కు తారక్ కు స్వాగతం పలకడం ఎక్సైటింగా ఉంది.
అతని రీసెంట్, రాబోయే సినిమాలను యునైటెడ్ స్టేట్స్ లో షూట్ చేయడం ఇండియా, యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉన్న భాగస్వామ్యం శక్తి ఏంటో చూపిస్తోంది. అంతేకాదు ఇది ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి, సంబంధాలు మరింత పటిష్టమవడానికి ఉపయోగపడతాయి” అని ఆమె అనడం గమనార్హం. ప్రశాంత్ నీల్ మూవీని అమెరికాలోనూ షూట్ చేయనున్నట్లు దీని ద్వారా స్పష్టమవుతోంది.
జూనియర్ ఎన్టీఆర్‌కు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. అతని ఆరోగ్యం బాగుందని తెలుసుకుని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అతని రాబోయే ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నాం.


