|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్ గురించి పూజా బేడి సంచలన వ్యాఖ్యలు! తారక్ అంత మంచివారా?

Published: 03-02-2026, 6:35 AM
  • శక్తి సినిమాలో ఎన్టీఆర్ మహిళలతో ఫైట్ చేయడానికి నిరాకరించారని పూజా బేడీ వెల్లడి.
  • మహిళల పట్ల ఎన్టీఆర్ గౌరవం చూసి ఆశ్చర్యపోయానని పూజా బేడీ అన్నారు.
  • ఎన్టీఆర్ నిజ జీవితంలో కూడా మహిళలకు గౌరవం ఇస్తారని పూజా బేడీ తెలిపారు.
  • ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి నటి పూజా బేడి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ మహిళల పట్ల ఎంతో గౌరవం చూపిస్తారని ఆమె తెలిపారు. శక్తి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు.

పూజా బేడి కామెంట్స్ వైరల్!

Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ (Prashanth Neel)డైరెక్షన్ లో డ్రాగన్ సినిమా(Dragon Film) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ (NTR) కెరియర్ విషయం పక్కన పెట్టే వ్యక్తిగత విషయానికి వస్తే ఎన్టీఆర్ వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. తన గురించి సోషల్ మీడియాలో ఎలాంటి విమర్శలు వచ్చిన పెద్దగా స్పందించరు. ఇక పెద్దవారి పట్ల ఎన్టీఆర్ చాలా గౌరవంగా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ గొప్పదనం గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పలు సందర్భాలలో తెలియచేశారు..

ఈ నేపథ్యంలోనే నటి పూజా బేడీ(Pooja Bedi) ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పాల్గొన్న ఈమె ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ శక్తి సినిమా షూటింగ్ సమయాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాలో పూజా బేడీ విలన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.. ఈ విషయం గురించి ఈమె మాట్లాడుతూ తనది నెగిటివ్ పాత్ర అయినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం తాను మహిళలతో ఫైట్ చేయనని ఖరాకండిగా చెప్పారని ఈమె తెలియచేశారు. కథపరంగా మహిళలతో ఫైట్ చేసే అవసరం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం మహిళల విషయంలో ఆయన చూపించే గౌరవం చూసి ఆశ్చర్యం కలిగిందని తెలిపారు.

మహిళల పట్ల ఎన్టీఆర్ గౌరవం

ఇలా సినిమాల విషయంలోనైనా, నిజజీవితంలో అయినా ఎన్టీఆర్ మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తారనేది ఈమె వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది. ఇలా మహిళల విషయంలో ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం చూసిన అభిమానులు ఎన్టీఆర్ మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ మంచితనం గురించి ఇప్పటికే ఆయనతో నటించిన ఎంతోమంది నటీమణులు గొప్పగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి తాజాగా పూజా బేడీ కూడా ఎన్టీఆర్ మంచితనంపై ప్రశంసలు కురిపించారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఈయన రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు.

డ్రాగన్ పనులలో బిజీగా తారక్..

ఫ్యాన్స్ ప్రశంసలు

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల అవుతున్నాయి .ఇటీవల ఈయన దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా అనంతరం బాలీవుడ్ వార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయదని చెప్పాలి. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా భారీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పూజా బేడి చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని మరోసారి చాటిచెబుతున్నాయి. ఆయన అభిమానులు ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మంచి మనసును కొనియాడుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.