|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీరామనవమి వేళ అల్లు అర్జున్ సర్‌ప్రైజ్: ఆ వ్యక్తికి ఇంత ప్రత్యేక బహుమతి ఇవ్వడానికి కారణం ఇదేనా?

Published: 27-03-2026, 12:35 PM
శ్రీరామనవమి వేళ అల్లు అర్జున్ సర్‌ప్రైజ్: ఆ వ్యక్తికి ఇంత ప్రత్యేక బహుమతి ఇవ్వడానికి కారణం ఇదేనా?
  • శ్రీరామనవమి సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేక కార్యక్రమం
  • జపాన్ గీక్ పిక్చర్స్ సీఈఓ టొమట్సు కోసానోకు సీతారాముల కళ్యాణం చిత్రం బహుమతి
  • మన సంస్కృతిని విదేశీయులకు తెలియజేసిన అల్లు అర్జున్
  • పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు పొందిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రీరామనవమి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకున్నారు. జపాన్కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ టొమట్సు కోసానోకు సీతారాముల కళ్యాణం చిత్రాన్ని బహుమతిగా అందజేసి, రామాయణం విశిష్టతను వివరించారు.

అల్లు అర్జున్ ప్రత్యేక బహుమతి

Allu Arjun: దేశవ్యాప్తంగా నేడు శ్రీరామనవమి పండుగ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి కళ్యాణ వేడుకలో పాల్గొన్న ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా శ్రీరామనవమి పండుగకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సైతం శ్రీరామనవమి పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారని స్పష్టమవుతుంది. ఇక శ్రీరామనవమి పండుగ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

శ్రీరామనవమి(Srirama Navami) పండుగ సందర్భంగా శ్రీరాములవారి విశిష్టతను తెలియజేసేలా ఈయన సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని జపాన్ కు చెందిన ప్రముఖ గీక్ పిక్చర్స్ సీఈవో టొమట్సు కోసానో(tomatsu kosano )కు అందచేయడమే కాకుండా సీతారాముల వారి గొప్పతనం గురించి కూడా అల్లు అర్జున్ వివరించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోల పైన అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. మన తెలుగు వారి సాంప్రదాయాలను విశిష్టత గురించి అల్లు అర్జున్ ఇలా చెప్పడం చాలా అద్భుతంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్న బన్నీ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఈయన అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది.

జపాన్ సీఈఓకు బహుమతి అందజేత

A reflection of his love for Indian culture and traditions. 🤍

Icon Star @AlluArjun presented a Sita Rama Kalyanam painting to Geek Pictures CEO Mr. Tomatsu Kosano, explaining the historical and spiritual essence of the Ramayana.🙏

A beautiful moment of cultural exchange… pic.twitter.com/T4dOeoBqxc

పుష్ప 2 తో పాన్ ఇండియా స్టార్

— Team Allu Arjun (@TeamAAOfficial) March 27, 2026

ఇలా ఈ సినిమా 70% షూటింగ్ పనులు పూర్తి అయినప్పటికీ ఇంతవరకు సినిమాకు సంబంధించి ఎలాంటి చిన్న క్లూ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ సినిమా టైటిల్ ఏంటి అనే వివరాలు కూడా ఎక్కడ లీక్ అవ్వలేదు. ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆ రోజున ఈ సినిమా నుంచి టైటిల్ రివీల్ చేయడమే కాకుండా, ఒక గ్లింప్ కూడా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడు లోకేష్ కనగారాజ్ డైరెక్షన్ లో చేయబోతున్నారు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీయర్ లో 23వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అల్లు అర్జున్ మన సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని ప్రపంచానికి చాటి చెప్పడం అభినందనీయం. ఆయన తదుపరి చిత్రాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.