
📌 Key Points
- జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? అభిమానుల ఆసక్తికర చర్చ!
- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ.. పాన్ ఇండియా రిలీజ్ సన్నాహాలు!
- 2009లో యాక్సిడెంట్.. ప్రాణాలు కాపాడిన వైద్యులకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు.
- కొత్త గడ్డం లుక్‌లో తారక్.. ‘డ్రాగన్’ కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? సీఎం అవుతారా? అభిమానుల అంచనాలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
25 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ఏం చేస్తారు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రనికి దర్శకుడు. దీనితో ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా తారక్ నేడు బెంగుళూరులో కిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సావానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తారక్ అక్కడ సందడి చేయడంతో అభిమానుల్లో కోలాహలం కనిపించింది.
ఈ కార్యక్రమంలో తారక్ తనకు ఎదురైన సరదా ప్రశ్నలకు అంతే సరదాగా బదులిచ్చారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ గురువారెడ్డి తారక్ ని ప్రశ్నిస్తూ.. 25 ఏళ్ళ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏంటి అని అడిగారు. తారక్బదులిస్తూ.. 25 ఏళ్ళ తర్వాత నా వయసు 67 అవుతుంది అని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. కానీ అభిమానులు మాత్రం సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రాజకీయాల్లోకి ఎన్టీఆర్.. అభిమానుల ఆకాంక్ష!
అంటే తారక్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనే అభిలాష అభిమానుల్లో బలంగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ గతంలో తనకు యాక్సిడెంట్ అయిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. 2009లో నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు గురువారెడ్డి గారు, భాస్కర్ గారు లాంటి వైద్యులు నా ప్రాణాలు కాపాడారు. వాళ్లందరికీ రుణపడి ఉంటాను అని తెలిపారు.
తారక్ కి ఎదురైన మరో ప్రశ్న.. ఒక వేళ డాక్టర్ అయితే ఎందులో స్పెషలిస్ట్ అయ్యేవారు అని అడుగగా.. తనకి చిన్న పిల్లలు అంటే బాగా ఇష్టం అని.. కాబట్టి పీడియాట్రీషియన్ అయ్యేవాడిని అని తెలిపారు.
ప్రమాదం నుండి నన్ను కాపాడింది వాళ్లే: ఎన్టీఆర్
మొత్తంగా ఈ ఈవెంట్ లో తారక్ కొత్త గడ్డం లుక్ అభిమానులని ఆకట్టుకుంది.డ్రాగన్ మూవీ కోసమే తారక్ ఇలా గడ్డం పెంచారు. బాగా సన్నబడి సిక్స్ ప్యాక్ లో కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
జూ.ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తుపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ‘డ్రాగన్’ మూవీతో ఆయన ఎలా మెప్పిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


