
ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ తర్వాత మళ్ళీ సిక్స్ ప్యాక్ లుక్‌తో ‘వార్ 2’ లో కనిపించాడు. బాలీవుడ్ సినిమా కోసం తన శరీరాన్ని మార్చుకున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
Key Points
Jr NTR 'వార్ 2' ట్రైలర్ విడుదలైంది.
బాలీవుడ్ సినిమా కోసం తారక్ సిక్స్ ప్యాక్ లుక్.
ఆగస్టు 14న 'వార్ 2' సినిమా విడుదల.
తారక్ సిక్స్ ప్యాక్ లుక్
కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా ఉండేవాడు. ‘రాఖీ’ సినిమాలో తారక్ రూపంపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత రాజమౌళి ‘యమదొంగ’ కోసం పూర్తి సన్నగా మారిపోయాడు. అప్పటినుంచి దాదాపు ఒకేలాంటి లుక్ మెంటైన్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు సినీ కెరీర్‌లో రెండోసారి సిక్స్ ప్యాక్ చూపించాడు. ఇంతకీ ఏంటి విషయం?
‘వార్ 2’ ట్రైలర్ హైలైట్స్
దాదాపు ఏడేళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా ‘అరవింద సమేత’. ఈమూవీ కోసం తొలిసారి సిక్స్ ప్యాక్ చూపించాడు. షర్ట్ లేకుండానే తారక్ ఇంట్రో ఫైట్‌లో కనిపించాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి సిక్స్ ప్యాక్ చేశాడు. అదీ బాలీవుడ్ సినిమా కోసం. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్.. హిందీలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే ‘వార్ 2’.
యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో తీసిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులు. ఆగస్టు 14న మూవీ రిలీజ్ కానున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో హృతిక్-తారక్ ఢీ అంటే ఢీ అనేలా కనిపించారు. ట్రైలర్‌లోనే తారక్ సిక్స్ ప్యాక్ లుక్ చూపించారు. ఇదే ఫ్యాన్స్‌కి మంచి ఫీస్ట్ ఇస్తోంది. ట్రైలర్ అయితే ఫుల్ ఆన్ యాక్షన్‌తో ఆకట్టుకుంటోంది. మరి మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.
హృతిక్ రోషన్ తో యాక్షన్
మొత్తంగా ‘వార్ 2’ ట్రైలర్ యాక్షన్ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. తారక్ సిక్స్ ప్యాక్ లుక్ ప్రత్యేక ఆకర్షణ. సినిమా విజయవంతం అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.


