
జూన్ 27, 2025 నాటి రాశి ఫలాలను ఇక్కడ చూడండి. ప్రతి రాశి వారి జీవితంలోని వివిధ అంశాలపై విశేష సూచనలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్తుపై కూడా వివరణలు ఉన్నాయి.
Key Points
జూన్ 27, 2025 నాటి రాశి ఫలాలను తెలుసుకోండి.
కన్య రాశి వారికి స్థానచలన యోగాలున్నాయి.
పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడతారు.
వివిధ రాశులకు ఆరోగ్యం, ఆర్థికం, ఉద్యోగంపై సూచనలు ఉన్నాయి.
వివిధ రాశులకు దినఫలాలు
రాశిఫలాలు (దిన ఫలాలు) : 27.06.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: ఆషాడ, వారం : శుక్రవారం, తిథి : శు. విదియ, నక్షత్రం : పునర్వసు
మేష రాశి వారి వ్యక్తిగత గౌరవం, స్థాయి పెరగడం, ఇతరులపై సరైన అవగాహన దృక్పథం కలిగి వారి అభిమానం పొందడం, ఉన్నత విద్యా విషయాలలోనూ ముందంజ వేస్తారు.
వృషభ రాశి వారికి ఇతరులతో స్నేహపూర్వకమైన ధోరణి అవసరం. తలనొప్పి, కంటి సమస్యలతో వైద్యుని సంప్రదిస్తారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
స్నేహితులు, బంధువులు, తోబుట్టుళ్లతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. మీ మనస్సు ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఎక్కువగా ఉండాలని కోరుకుంటుంది.
ఆరోగ్యం మరియు ఆర్థికంపై సూచనలు
కర్కాటక రాశి వారు వృత్తి వ్యాపారాలలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారితోషకాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు, న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది.
సింహ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తిపరమైన రంగంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఊహించని సహకారాన్ని పొందుతారు.
కన్య రాశి వారికి స్థానచలన సూచనలు గలవు. అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబం సుఖసంతోషాలతో ఉంటుంది. సంతానం ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడతారు. వారిని మరిన్ని విజయాలు వెంబడిస్తాయి.
తుల రాశి వారికి ఊపిరితిత్తులు, ఛాతీ సమస్యలు, అధిక రక్తపోటు వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. భూ స్థిరాస్తులు మార్పు చేయడం వలన లాభపడతారు.
వృశ్చిక రాశి వారు ఉద్యోగ వృత్తి విషయాల్లో ముందంజ వేస్తారు. సమాజ గౌరవం కలుగుతుంది. అధికారం వరిస్తుంది. మీ సలహా కోసం ప్రజలు వేచి చూస్తారు. మీరు సంప్రదాయ పరిరక్షకులుగా కీర్తింపబడతారు.
స్థానచలనం మరియు ఉద్యోగ అవకాశాలు
ఉన్నత విద్యావకాశాలు వస్తాయి. మీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాంకేతికపరమైన సంస్థలను నెలకొల్పి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. కొంతమేరకు వనరుల వృద్ధి, ఆదాయ వృద్ధి కలుగుతుంది.
మకర రాశి వారు ఇతరులను అధిగమించి, పోటీ పరీక్షలలో రాణించి విజయాన్ని వరిస్తారు. ఈ రాశిలోని ప్రతివారు ఈ మాసంలో ఏదో ఒక విధంగా రాణించి లాభపడతారు. సంపద కూడా పెరుగుతుంది. సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు.
కుంభ రాశి వారు దూర ప్రాంతాలకు వెళ్లడం, విదేశీ మారకద్రవ్యాన్ని పొందగలుగుతారు.ఈ రాశి వారికి స్థానచలనం అవకాశం ఉంది.
ఆర్థిక స్థితి పెరుగుతుంది. శత్రువులు మీకు హాని చేయలేరు. ధైర్యంగా ముందుకు దూసుకుపోతారు. సోదర వర్గం నుంచి సహకారం అందుతుంది. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇచ్చి ఇతరులకు ఆకర్షణగా నిలుస్తారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ – 9494981000
ఈ రాశి ఫలాలు సూచనలు మాత్రమే. మీ నిర్ణయాలకు ఇవి మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి. శుభం.


