|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జూనియర్ కలెక్షన్: తొలిరోజు కంటే రెండో రోజు కాస్త ఎక్కువ వసూళ్లు

Published: 20-07-2025, 5:44 AM
జూనియర్ కలెక్షన్: తొలిరోజు కంటే రెండో రోజు కాస్త ఎక్కువ వసూళ్లు

కిరీటి నటించిన ‘జూనియర్’ సినిమా థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ‘వైరల్ వయ్యారి’ పాట వైరల్ అవడం సినిమాకు ప్రయోజనం చేకూర్చింది. రెండో రోజు వసూళ్లు తొలిరోజు కంటే ఎక్కువగా ఉన్నాయి.

Key Points

1

జూనియర్ సినిమా తొలిరోజు రూ.1.45 కోట్లు వసూలు చేసింది.

2

రెండో రోజు వసూళ్లు రూ.1.65 కోట్లకు చేరుకున్నాయి.

4

వచ్చే వారం 'హరిహర వీరమల్లు' సినిమా విడుదల కానుండటంతో జూనియర్ సినిమాకు పోటీ ఎదురవుతుంది.

జూనియర్ సినిమా బాక్స్ ఆఫీస్ ప్రదర్శన

రీసెంట్‌గా థియేటర్లలో పలు చిత్రాలు రిలీజ్ కాగా.. ‘జూనియర్’ చిత్రానికి చెప్పుకోదగ్గ వసూళ్లు కనిపిస్తున్నాయి. కిరీటికి హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డ్యాన్సులు, ఫైట్స్, డైలాగ్స్ లాంటివి బాగా చెప్పడం.. దానికి తోడు ‘వైరల్ వయ్యారి’ పాట తెగ వైరల్ అయిపోయేసరికి జనాలు ఈ మూవీని చూసేందుకు ఓ మాదిరిగా థియేటర్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు కంటే రెండో రోజు వసూళ్లు కాస్త ఎక్కువగానే వచ్చాయి. ఇంతకీ రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్ ఎంత?

కిరీటి, శ్రీలీల, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ తరహా కథతోనే తెరకెక్కించారు. అంతెందుకు గతంలో వచ్చిన తెలుగు చిత్రాల ఛాయలు కూడా చాలా కనిపిస్తాయి. అయితేనేం వేరే చిత్రాలేం లేకపోవడం దీనికి ఓ రకంగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.1.45 కోట్లు వసూళ్లు రాగా.. రెండో రోజు రూ.1.65 కోట్ల మేర కలెక్షన్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అంటే రెండు రోజులకు కలిపి రూ.3.10 కోట్ల మేర నెట్ కలెక్షన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

‘వైరల్ వయ్యారి’ పాట ప్రభావం

హీరోగా కొత్త కుర్రాడు చేస్తున్నప్పటికీ ఈ మాదిరి వసూళ్లు అంటే కాస్త విశేషమనే చెప్పాలి. అయితే వచ్చేవారం థియేటర్లలోకి ‘హరిహర వీరమల్లు’ రానుంది. ఇంతలోనే ‘జూనియర్’ కలెక్షన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఈ మూవీకి లాంగ్ రన్ అయ్యేసరికి ఎంత వసూళ్లు వస్తాయో చూడాలి?

వచ్చే వారం పోటీ

జూనియర్ విషయానికొస్తే.. జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు అభి(కిరీటి). కాలేజీలో సరదాగా గడుపుతూనే చదువులో మంచి ప్రతిభ చూపిస్తాడు. తను ప్రేమించిన శ్రీలీల పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ ఆ కంపెనీ బాస్ విజయ(జెనీలియా)కు అభి అస్సలు నచ్చడు. ఆమెకు తన పేరుతో ఉన్న విజయనగరం అనే ఊరు కూడా నచ్చదు. అలాంటిది అభితో కలిసి విజయ.. విజయనగరం వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? ఆ ఊరికి విజయకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.

మొత్తంగా ‘జూనియర్’ సినిమా తొలి రెండు రోజుల్లో మంచి వసూళ్లు సాధించింది. అయితే, ‘హరిహర వీరమల్లు’ విడుదలతో పోటీ తీవ్రమవుతుంది. సినిమా ఎంత వరకు ఆదరణ పొందుతుందో చూడాలి.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.