
నటి జ్యోతి సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌తో పెళ్లి వార్తలపై తాజాగా స్పందించింది. అవి కేవలం సినిమా కోసమే అని, తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయితే, తాను రెండో పెళ్లి చేసుకుంటానని, అయితే తన బాధ్యతలను చూసి చాలా మంది వెనకడుగు వేస్తున్నారని వెల్లడించింది.
Key Points
శ్రీకాంత్ అయ్యంగార్‌తో పెళ్లి వార్తలు అవాస్తవం అని జ్యోతి స్పష్టం చేసింది.
వైరల్ అయిన ఫోటోలు సినిమా సన్నివేశం కోసం తీసినవి అని వివరించింది.
గతంలో వివాహం చేసుకొని బాబుని కన్న తర్వాత విడాకులు తీసుకున్న జ్యోతి.
రెండో పెళ్లి చేసుకుంటానని, బాధ్యతలు స్వీకరించే వ్యక్తి కోసం చూస్తున్నానని తెలిపింది.
శ్రీకాంత్ అయ్యంగార్‌తో పెళ్లి వార్తలు నిజమేనా?
Jyothi : ఇటీవల కొన్నాళ్ల క్రితం నటి జ్యోతి సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తో క్లోజ్ గా కనిపించి వైరల్ అయింది. జ్యోతి బర్త్ డే పార్టీకి వచ్చిన శ్రీకాంత్ అయ్యంగార్ ఆమెని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోవడంతో ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఈ జంట పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి.(Jyothi)
తాజాగా ఓ ఛానల్ కి జ్యోతి ఇంటర్వ్యూ ఇవ్వగా శ్రీకాంత్ అయ్యంగార్ తో పెళ్లి పై, తన రెండో పెళ్లి గురించి మాట్లాడింది. గతంలో జ్యోతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని బాబుని కన్న తర్వాత రెండేళ్లకు విడాకులు తీసుకుంది. అప్పట్నుంచి సింగిల్ గానే ఉంటుంది జ్యోతి.
జ్యోతి గత జీవితం, విడాకులు
తాజాగా ఇంటర్వ్యూలో జ్యోతి మాట్లాడుతూ.. శ్రీకాంత్ అయ్యంగార్ తో పెళ్లి అనే వార్తలు ఫేక్. నేను బర్త్ డే పార్టీ ఉంటే వెళ్ళాను. నాకు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ సీన్ లో నన్ను హత్తుకొని కిస్ చేయాలి. శ్రీకాంత్ అది నన్ను అడిగి చేసారు. ఇలా ఫోటో తీసుకుందాం అంటే ఓకే అన్నాను. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అన్నారు. సరే అంటే ఆ ఫోటో షేర్ చేసి.. మ్యారేజ్ అంటూ ఏదో పోస్ట్ చేసారు.
రెండో పెళ్లికి జ్యోతి షరతులు
ఇంకేముంది అంతా అయిపొయింది. బాగా ట్రోల్ చేసారు. సోషల్ మీడియాలో వైరల్ అయింది. నరేష్ – పవిత్ర లాగా మా జంట అని అన్నారు. అది జస్ట్ సినిమా కోసం అనుకోకుండా జరిగింది. ఆ వార్తలన్నీ ఫేక్. ఆయన ఒక మంచి ఫ్రెండ్. నేను రెండో పెళ్లి చేసుకుంటాను. నాకు ప్రపోజల్స్ వస్తున్నాయి కానీ నా బాధ్యతలు చూసి వెనక్కి వెళ్లిపోతున్నారు. నాకు మంచి పార్ట్నర్ కావలి. నన్ను ప్రిన్సెస్ లాగా చూసుకోవాలి. నా బాధ్యతలు కూడా తీసుకోవాలి అని తెలిపింది. మరి జ్యోతి రెండో పెళ్లి ఎవర్ని చేసుకుంటుందో చూడాలి.
శ్రీకాంత్ అయ్యంగార్‌తో పెళ్లి వార్తలను కొట్టిపారేసిన జ్యోతి.. రెండో పెళ్లికి సుముఖంగా ఉన్నట్లు తెలిపింది. మరి ఆమె బాధ్యతలను స్వీకరించి, ఆమెను ప్రిన్సెస్ లా చూసుకునే ఆ వ్యక్తి ఎవరు అనేది వేచి చూడాలి.


