|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్య విషయంలో మౌనం.. శివాజీకి సమన్లు! మహిళా కమిషన్‌పై కేఏ పాల్ నిప్పులు.

Published: 28-12-2025, 1:04 AM
బాలయ్య విషయంలో మౌనం.. శివాజీకి సమన్లు! మహిళా కమిషన్‌పై కేఏ పాల్ నిప్పులు.
  • మహిళా కమిషన్ పనితీరుపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.
  • బాలకృష్ణ ‘కడుపు చేస్తానంటే’ వ్యాఖ్యలపై కమిషన్ మౌనంపై ప్రశ్నించిన పాల్.
  • శివాజీకి సమన్లు, బాలయ్యకు మినహాయింపుపై కేఏ పాల్ అసంతృప్తి వ్యక్తం.
  • బీజేపీలో చేరితే ఎన్ని కేసులున్నా తొలగిపోతాయని పాల్ ఆరోపణ.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ “కడుపు చేస్తానంటే” వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. శివాజీ విషయంలో వెంటనే స్పందించిన కమిషన్, బాలయ్య విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని కేఏ పాల్ మండిపడ్డారు.

కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు: శివాజీ కేసుపై స్పందన

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ మహిళల వస్త్రాదరణపై చేసిన కామెంట్లపై మహిళా కమిషన్ సీరియస్ అయిందని చెప్పారు. ఆయనకు సమన్లు జారీ చేస్తే వెళ్లి క్షమాపణలు కూడా చెప్పాడని అన్నారు. ఆయన కావాలని ఆ వ్యాఖ్యలు చేశాడని తాను అనుకోవడం లేదన్నారు. కానీ ఆయనను విచారణకు పిలవడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. మరి న‌టుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మ‌హిళ‌ల గురించి కామెంట్స్ చేసిన‌ప్పుడు మ‌హిళా క‌మిష‌న్ ఏం చేసింద‌ని ప్ర‌శ్నించారు. ఫ్యాన్స్ అడిగితే అమ్మాయిల‌కు ముద్దు అయినా పెట్టాలి క‌డుపైనా చేయాలి అని నేష‌న‌ల్ ప్లాట్ ఫామ్ పై మాట్లాడాడ‌ని మ‌రి అప్పుడు మ‌హిళా క‌మిష‌న్ ఎక్క‌డ పోయింద‌ని ప్ర‌శ్నించాడు.

నేష‌న‌ల్ ఉమెన్ క‌మిష‌న్ ఏమైంద‌ని అన్నాడు. ఆయ‌న‌కు ప‌ద్మ‌భూష‌ణ్ ఇచ్చార‌ని, వ‌చ్చే ఏడాది భార‌త ర‌త్న కూడా ఇస్తార‌న్నాడు. యూపీలో మాజీ బీజేపీ ఎమ్మెల్యే మైన‌ర్ ను అత్యాచారం చేస్తే ఆయ‌న‌కు కోర్టులో బెయిల్ ఇచ్చార‌ని మండిప‌డ్డాడు. బాధితురాలు త‌న‌కు ముప్పు ఉంద‌ని చెప్పినా నిందితుడిని వ‌దిలిపెట్టార‌న్నారని చెప్పారు. బీజేపీని ప్ర‌శ్నించి కాంగ్రెస్ ను ప్ర‌శంసించినందుకే శివాజీని టార్గెట్ చేస్తున్నార‌ని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరితే ఎన్ని కేసులు ఉన్నా తొల‌గిపోతాయ‌ని చెప్పారు. దేశంలో ఛ‌త్తీస్ గడ్ స‌హా ప‌లు రాష్ట్రాల్లో చ‌ర్చిల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని అలా జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దేశాన్ని కాపాడాల‌ని అన్నారు.

బాలకృష్ణకు ఒక న్యాయం.. శివాజీకి మరొకటా?

రాజకీయ కుట్ర ఆరోపణలు: బీజేపీపై పాల్ విమర్శలు

మొత్తం మీద, మహిళా కమిషన్ పనితీరుపై కేఏ పాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శివాజీపై చర్యలు, బాలకృష్ణకు మినహాయింపు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.