
దుల్కర్ సల్మాన్ నటించిన ‘కాంత’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే రూ.24.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అదరగొట్టింది. పాజిటివ్ టాక్‌తో కలెక్షన్లు రాబడుతున్న ఈ సినిమాపై కోర్టులో పిటిషన్ దాఖలవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Key Points
'కాంత' చిత్రం మూడు రోజుల్లో రూ.24.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.10.5 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.
ఈ సినిమా ఎం.కె. త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా తెరకెక్కింది.
త్యాగరాజ భాగవతార్ మనవడు సినిమాపై కోర్టులో పిటిషన్ వేశారు.
‘కాంత’ మూడు రోజుల వసూళ్లు
దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ బోర్సో జంటగా వచ్చిన తాజా చిత్రం కాంత(Kaantha collections). పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. ఫస్ట్ డే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 10.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
పాన్ ఇండియా చిత్రం ‘కాంత’
ఇక వీకెండ్ కలిసి రావడంతో కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే రూ.24.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. సెల్వమణి సెల్వరాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా, సముద్రఖని కీలకపాత్రలుపోషించారు. దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిల్మ్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాపై నిర్మించారు.
‘కాంత’ చుట్టూ వివాదం
తమిళ సినిమా తొలి సూపర్ స్టార్ ఎం.కె త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా కాంత సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ మూవీలో తమ తాతయ్యను తప్పుగా చూపించారని త్యాగరాజ భాగవతార్ మనవడు ప్రభుత్వ విశ్రాంత జాయింట్ కార్యదర్శి త్యాగరాజన్ (64) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కోర్టులో కూడా పిటిషన్ వేశారు. దీంతో న్యాయస్థానం కూడా ఆ పిటిషన్‌పై జవాబు ఇవ్వాలని దుల్కర్ సల్మాన్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చింది.
మొత్తంగా, దుల్కర్ సల్మాన్ ‘కాంత’ సినిమా వసూళ్ల పరంగా మంచి ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, త్యాగరాజ భాగవతార్ వారసుల నుంచి వచ్చిన చట్టపరమైన వివాదం సినిమా భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చు. ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.


