
దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి నటించిన ‘కాంత’ సినిమా థియేటర్లలో విడుదలైంది. హీరో-డైరెక్టర్ మధ్య ఇగో క్లాష్ నేపథ్యంతో సాగే ఈ పీరియాడిక్ డ్రామాలో ఒక హత్య మిస్టరీ ఆసక్తిని రేపుతుంది. ఈ మూవీ ఎలా ఉందో మా ప్రత్యేక రివ్యూలో తెలుసుకోండి.
Key Points
దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించారు.
హీరో-డైరెక్టర్ ఇగో క్లాష్ నేపథ్యంతో సాగే సినిమా ఇది.
సినిమా షూటింగ్ సమయంలో జరిగే హత్య మిస్టరీ ప్రధానాంశం.
1950-60ల సినీ స్వర్ణయుగాన్ని కళ్లకు కట్టే పీరియాడిక్ డ్రామా.
కాంత కథా నేపథ్యం, కథనం
దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించిన డ్రామా చిత్రం కాంత. సెల్వమణని సెల్వరాజ్ దర్శకత్వం వహించిన కాంత ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. హీరో, డైరెక్టర్ మధ్య క్లాష్‌తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో నేటి కాంత రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: కాంత (Kaantha Movie)
నటీనటులు: దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, దగ్గుబాటి రానా, రవీంద్ర విజయ్ తదితరులు
కథ, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్
సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపేజ్
ఎడిటింగ్: లెవెలిన్ ఆంథోని గొంజాల్వేజ్
నటీనటుల ప్రదర్శన: దుల్కర్, రానా
నిర్మాత: ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్, దగ్గుబాటి రానా, దుల్కర్ సల్మాన్
విడుదల తేది: 14 నవంబర్ 2025
సినీ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్‌గా మారిన సినిమా కాంత. హీరో, డైరెక్టర్ మధ్య వచ్చే ఇగో క్లాష్ గురించి సినిమాపైనే తెరెకెక్కిన మూవీ కాంత. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి , సముద్రఖని వంటి స్టార్స్ నటించిన సినిమా ఇది. ఇందులో హీరోయిన్‌గా బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే చేసింది. అలాగే, పాపులర్ నటుడు రవీంద్ర విజయ్ కీలక పాత్ర పోషించారు.
అయితే, మహదేవన్ చెప్పిన క్లైమాక్స్ తో పాటు టైటిల్ కాంత అని ఉండాలని షరతు పెడతాడు హీరో. తన తల్లి కథను తెరపై చూసుకోవాలన్న ఒకే ఒక్క కోరికతో అయ్య సినిమాను తీసేందుకు ఒప్పుకుంటాడు. షూటింగ్ జరిగిన హీరో, డైరెక్టర్ మాట్లాడుకోరు. ఒకరికొకరికి పడదు. ఇక సినిమా పూర్తి కావోస్తున్న సమయంలో బృందంలో ఒకరు హత్యకు గురవుతారు.
ఆ తర్వాత ఏమైంది? ఎవరు హత్యకు గురయ్యారు? ఆ హత్యకు గల కారణాలు ఏంటీ? కేసును ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన ఇన్‌స్పెక్టర్ దేవరాజ్ (రానా దగ్గుబాటి) నిందితుడిని కనిపెట్టాడా? దేవరాజ్ ప్రభావం కాంతపై ఎలా పడింది? గురు శిష్యుల బంధం చెడిపోడానికి గల కారణాలు ఏంటీ? హీరోయిన్ కుమారి (భాగ్యశ్రీ బోర్సే) పాత్ర ఏంటీ? చివరికీ ఏమైంది? కాంత రిలీజ్ అయిందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
హత్య మిస్టరీ, పీరియాడిక్ డ్రామా
అలాగే, సినీ రంగంపై వచ్చే సినిమాలా దాదాపుగా చాలా అరుదు. ఎప్పుడో ఓసారి వస్తుంటాయి. ఓల్డ్ సినీ యుగాన్ని చాలా మంది సినీ స్వర్ణయుగంగా పిలుచుకుంటారు. దీనిపై వచ్చిన కాంత అప్పటి యుగాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. 1950-60 కాలంలో తెరకెక్కినట్లుగా పీరియాడిక్ డ్రామాగా కాంతాను చూపించారు.
ప్రముఖ పాత్ర హత్యతో కథ మలుపు తిరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారన్న దానిపై సెకండాఫ్ అంతా సాగుతుంది. అప్పటివరకు పీరియాడిక్ డ్రామాగా ఉన్న సినిమా ఒక్కసారిగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్‌గా మారిపోతుంది. అయితే, ఫస్టాఫ్ ఇచ్చిన అంత ఎగ్జైట్‌మెంట్ సెకండాఫ్ ఇవ్వలేకపోయింది.
ఇక క్లైమాక్స్ ఎమోషనల్‌గా మెప్పిస్తుంది. హత్య, ఎవరు చేశారు, ఎందుకు చేశారనే పెద్ద ట్విస్ట్‌తో కాంత ముగుస్తుంది. దుల్కర్ సల్మాన్ నట విశ్వరూపం చూపించాడు. నట చక్రవర్తి పాత్రలో జీవించేశాడు. అప్పటి హీరోల హావాభావాలను చాలా బాగా పలికించాడు. అయితే, కొన్ని చోట్ల మహానటి సినిమాలో జెమినీ గణేశన్‌ను గుర్తు చేస్తాడు.
సముద్రఖని నటన గుర్తుండిపోతాడు. రాజీపడని దర్శకుడి పాత్రపై తన నటనతో ప్రభావం చూపించారు. దుల్కర్, సముద్రఖని మధ్య వచ్చే సన్నివేశాల్లో హైలెట్ అవ్వడానికి కారణం వారి నటనే. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అభినయంతో కట్టిపడేస్తుంది. గ్లామర్ రోల్స్ చేసిన భాగ్యశ్రీ నటిగా ఓ మెట్టు ఎక్కింది. దుల్కర్, భాగ్యశ్రీ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది.
నిర్మాణ విలువలు, కెమెరా పనితనం చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే సినిమాపైనే వచ్చిన కాంత మూవీ హీరో, డైరెక్టర్ అహం, హత్య, డ్రామా, ఇన్వెస్టిగేషన్‌తో మెప్పిస్తుంది.
కాంత సినిమా సినీ పరిశ్రమలోని అంతర్గత సంఘర్షణ, ఒక హత్య మిస్టరీని 1950ల నేపథ్యంలో అద్భుతంగా చూపించింది. అరుదైన కథనంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు.


