|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kaantha Teaser: ఆకట్టుకునేలా ‘కాంత’ టీజర్.. రిలీజ్ డేట్ కూడా

Published: 28-07-2025, 6:13 AM
Kaantha Teaser: ఆకట్టుకునేలా 'కాంత' టీజర్.. రిలీజ్ డేట్ కూడా

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన ‘కాంత’ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. రానా నిర్మించిన ఈ పీరియాడిక్ చిత్రం 1960ల నేపథ్యంలో సాగుతుంది. టీజర్ ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది.

Key Points

1

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ నటించిన 'కాంత' టీజర్ విడుదల.

2

1960ల నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామా.

4

సెప్టెంబరు 12న థియేటర్లలో విడుదల.

‘కాంత’ టీజర్ హైలైట్స్

దుల్కర్ సల్మాన్ పేరుకే మలయాళ హీరో కానీ తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ‘మహానటి’, ‘సీతారామం’ చిత్రాల దెబ్బకు స్ట్రెయిట్ తెలుగు హీరోల కంటే బోలెడంత క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే చేసిన సినిమా ‘కాంత’. ప్రముఖ హీరో రానా నిర్మిస్తున్న ఈ మూవీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. తాజాగా దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.

కథాంశం మరియు నటీనటులు

గతంలో ‘మహానటి’ సినిమాలో శివాజీ గణేషన్‌గా దుల్కర్ సల్మాన్ అదిరిపోయే యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు ‘కాంత’ మూవీలోనూ 1960ల్లో ఉంటే ఓ స్టార్ హీరోగా నటించాడు. టీజర్ బట్టి చూస్తే..దుల్కర్ ఓ స్టార్ హీరో. సముద్రఖని ఓ నిర్మాత. వీళ్లిద్దరూ కెరీర్ ప్రారంభంలో కలిసి మెలిసి ఉంటారు. కానీ తర్వాత గొడవలు వచ్చి విడిపోతారు. అలాంటిది సముద్రఖని తీసే ‘శాంత’ అనే హారర్ మూవీలో దుల్కర్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లు. ఇక ఈ సినిమాని తెరకెక్కించే విషయంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? దుల్కర్-సముద్రఖని మధ్య ఏం జరిగింది? అనేదే సినిమాలా అనిపిస్తుంది.

విడుదల తేదీ

టీజర్ చూస్తుంటేనే సమ్‌థింగ్ డిఫరెంట్ మూవీలా ఉండబోతుందనే ఫీల్ వచ్చింది. ఇందులో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. సెప్టెంబరు 12న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. చూస్తుంటే దుల్కర్ మరో హిట్ కొట్టడం గ్యారంటీ అనిపిస్తుంది.

సుమారుగా 1960ల నేపథ్యంలో సాగే ‘కాంత’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉంటుందని టీజర్ సూచిస్తుంది. సెప్టెంబరు 12న విడుదల కానున్న ఈ చిత్రం దుల్కర్ సల్మాన్ కెరీర్ లో మరో విజయవంతమైన చిత్రం కావచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.