|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కచ్చితంగా ఆపగలం: ది 100

Published: 05-07-2025, 6:49 PM
కచ్చితంగా ఆపగలం: ది 100

ఆర్‌.కే. సాగర్ హీరోగా నటించిన ‘ది 100’ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. పవన్ కళ్యాణ్ ట్రైలర్‌ను లాంచ్ చేయగా, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం…

Key Points

1

‘మొగలి రేకులు’ ఫేమ్ ఆర్‌.కే. సాగర్ హీరోగా ‘ది 100’ సినిమా

2

పవన్ కళ్యాణ్ ట్రైలర్ లాంచ్ చేశారు

4

మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రల్లో నటించారు

‘ది 100’ సినిమా విడుదల తేదీ

‘మొగలి రేకులు’ సీరియల్‌ ఫేమ్‌ ఆర్‌కే సాగర్‌ హీరోగా నటించిన చిత్రం ‘ది 100’. రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిషా నారంగ్‌ కథానాయికగా నటించగా, ధన్యా బాలకృష్ణ కీలకపాత్రపోషించారు. కేఆర్‌ఐఏ ఫిల్మ్‌ కార్ప్, దమ్మ ప్రోడక్షన్స్‌ బ్యానర్‌లపై రమేష్‌ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, హీరో పవన్‌ కల్యాణ్‌ ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

‘జీవితంలో జరిగిపోయినది మనం మార్చలేం… కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా ఆపగలం’ అనే విక్రాంత్‌ ఐపీఎస్‌ వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్‌ప్రారంభమవుతుంది. ‘‘యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో విక్రాంత్‌ ఐపీఎస్‌గా ఆర్‌కే సాగర్‌ అద్భుతంగా నటించారు. మిషా నారంగ్‌పాత్ర కథకు రొమాంటిక్‌ టచ్‌ను యాడ్‌ చేస్తుంది’’ అని పేర్కొన్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్, కెమెరా: శ్యామ్‌ కె. నాయుడు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణ

‘ది 100’ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో సినిమా విజయవంతం అవుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.