
📌 Key Points
- ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల జోడీగా ‘ఎపిక్’ మూవీ.
- దర్శకుడు ఆదిత్య హాసన్; నిర్మాతలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.
- వైష్ణవి పుట్టినరోజున ‘కడలి’ పోస్టర్ రిలీజ్.
- కడలి పాత్రపై వైష్ణవి చైతన్య ఎమోషనల్ పోస్ట్ వైరల్.
‘బేబీ’ హిట్ పెయిర్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ చిత్రంతో రానున్నారు. వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘కడలి’ పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్‌పై వైష్ణవి చేసిన ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఎపిక్ మూవీ: కాస్ట్ అండ్ క్రూ వివరాలు
‘బేబీ'(Baby) సినిమాతో హిట్ పెయిర్‌గా నిలిచిన ఆనంద్ దేవరకొండ(Anandh Devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) మరోసారి ‘ఎపిక్'(Epic) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘#90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆమె పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ఆమెకు విషెస్ తెలిపారు.
దీంతో వైష్ణవి తన సోషల్ మీడియాలో ఆ పోస్టర్‌ను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘కడలికి నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆమెకు ప్రాణం పోసుకోవడం నాకు చాలా ఆనందంగా, గౌరవంగా అనిపించింది. ఈ సినిమా, ఈ పాత్ర, దాని వెనుక ఉన్న అందమైన వ్యక్తులకు మాటల్లో చెప్పలేని కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు’ అని రాసుకొస్తూ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఆమెకు విషెస్‌తో పాటు సినిమా మంచి విజయం సాధించాలని కామెంట్స్ చేస్తున్నారు.
కడలిగా వైష్ణవి చైతన్య ఫస్ట్ లుక్
పోస్టర్‌పై వైష్ణవి ఎమోషనల్ పోస్ట్
వైష్ణవి చైతన్య కడలి పాత్రకు ప్రాణం పోసిన తీరు, ఆమె ఎమోషనల్ పోస్ట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించి, ఆమె కెరీర్‌కు మరింత బూస్ట్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.


