|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OG 2లో పవన్ సరసన కాజల్.. అసలు మ్యాటర్ ఏంటంటే.. మాస్ అప్‌డేట్ వైరల్!

Published: 26-06-2026, 10:51 AM
OG 2లో పవన్ సరసన కాజల్.. అసలు మ్యాటర్ ఏంటంటే.. మాస్ అప్‌డేట్ వైరల్!
  • పవన్ కళ్యాణ్ OG 2లో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా వార్తలు వైరల్.
  • సుజిత్ దర్శకత్వంలో OG 2 స్క్రిప్ట్ పనుల తుది దశలో.
  • పవన్, కాజల్ గతంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో కలిసి నటించారు.
  • OG 2ను ప్యాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దాలని మేకర్స్ ప్లాన్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా ఓ మాస్ అప్‌డేట్! ‘OG 2’ మూవీపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ సంచలన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఆ వార్త ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!

OG 2లో కాజల్ అగర్వాల్ ఎంట్రీ.. నిజమేనా?

OG 2 : పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్‌లో వచ్చిన OG సినిమాకు స్వీకెల్ తెర‌కెక్కించేందుకు స‌న్నాహ‌కాలు ప్రారంభం అయ్యాయి. ఓజీ-2 షూటింగ్ స్టార్ట్ కాముందే క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఓజీ రిలీజైన వన్‌ వీక్‌లోనే ఓజీ-2పై టాక్‌ మొదలవగా..త్వరలోనే ఓజీ-2 షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. సుజిత్ స్క్రిప్ట్‌కు ఫైనల్‌ టచ్‌ ఇస్తున్నాడని..త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తారని టాక్.

ఇదే సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఓజీ-2లో పవన్ సరసన హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ను తీసుకుంటారని టాక్. పవన్‌తో సర్ధార్ గబ్బర్ సింగ్‌లో యాక్ట్ చేసిన కాజల్.. మళ్లీ సక్సెస్‌ను అందిస్తుందా అనే ఎక్స్‌పెక్టేషన్ కూడా పెరిగిపోతున్నాయి.

పవన్, కాజల్ కాంబోపై భారీ అంచనాలు!

అయితే ఇప్పటివరకు మూవీ టీమ్ నుంచి హీరోయిన్‌పై ఎలాంటి అధికారిక క్లారిటీ మాత్రం రాలేదు. ఓజీ పార్ట్‌ వన్‌లో ప్రియాంక మోహన్ కీలక పాత్రలో కనిపించగా, పార్ట్‌లో కాజల్ అగర్వాల్‌ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది

OG 2.. ప్యాన్ ఇండియా లెవెల్ ప్లాన్స్!

OG-2ను మరింత స్టైలిష్‌గా, పాన్ ఇండియా లెవెల్‌లో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే క్రేజీ, ఫెమిలియర్ ఫేస్ అయిన కాజల్ అగర్వాల్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు టాక్. మరోవైపు కొందరు మాత్రం ఇది పూర్తిగా రూమర్ మాత్రమే అని చెబుతున్నారు, ఎందుకంటే ఓజీ-2 ప్రాజెక్ట్ ఇంకా ప్లానింగ్ స్టేజ్‌లోనే ఉందని, కాస్టింగ్ ఫైనల్ కాలేదని కొట్టిపారేస్తున్నారు. కాజల్ నిజంగానే ఓజీ 2లో కనిపిస్తుందా.? లేక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా.? అన్నది అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు సస్పెన్స్ గానే ఉండబోతోంది.

‘OG 2’పై నెలకొన్న ఈ ఉత్కంఠ నిజంగా సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో రాబోయే ఈ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అధికారిక అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.