
బాలీవుడ్ నటి కాజోల్ తన కుమార్తె నైసా దేవగన్ సినిమాల్లోకి రావడంపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలకు ప్రతిస్పందనగా ఆమె ఈ విషయంపై స్పష్టతనిచ్చింది.
Key Points
కాజోల్ కుమార్తె నైసా దేవగన్ సినీరంగ ప్రవేశంపై తల్లి కాజోల్ స్పందన.
నైసా ప్రస్తుతం సినిమాల్లో నటించాలనుకోవడం లేదని కాజోల్ వెల్లడి.
స్టార్ కిడ్స్ ఎదుర్కొనే సవాళ్ల గురించి కాజోల్ అభిప్రాయాలు.
కాజోల్ కామెంట్స్ తో ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు.
నైసా దేవగన్ సినీ ప్రవేశంపై కాజోల్ స్పందన
బాలీవుడ్ స్టార్ నటి కాజోల్.. ప్రజెంట్ వరుస ప్రాజెక్టులతో సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తన గారాలపట్టి కుమార్తె నైసా దేవగన్ ఇండస్ట్రీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. నిజానికి నైసా దేవగన్‌కు ప్రస్తుతం 22ఏళ్లు వయస్సు కాగా.. హీరోయిన్ మెటీరియల్ అంటూ త్వరలోనే ఆమె కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
తాజాగా వీటిపై స్పందించిన కాజల్.. ‘నైసా నటనలోకి రావడం లేదు. ఆమెకు ప్రస్తుతం 22 ఏళ్లు.. అలాగే పరిశ్రమలోకి రావలానే ఉద్దశం తనకు లేదు’ అని తెలిపింది. దీంతో కాజోల్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక స్టార్ కిడ్స్ ఎదుర్కొంటోన్న చాలెంజెస్ గురించి మాట్లాడుతూ.. ‘వాళ్లు సినిమా ప్రపంచంలోకి రావడానికి మాత్రమే మా ప్రమోయం ఉంటుంది. ఒకసారి వచ్చిన తర్వాత పాజిటివ్లు, నెగిటివ్లు భరించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇవన్ని కఠినంగా అనిపించిన.. అది వాళ్ల గ్రోత్‌కు ఉపయోగపడతాయి. అలాగే సక్సెస్ అనేది కూడా వాళ్లు నటన, కథలపై ఆధారపడి ఉంటుంది’ అంటూ తెలిపింది.
స్టార్ కిడ్స్ ఎదుర్కొనే సవాళ్లు
ఫ్యాన్స్ నిరుత్సాహం
కాజోల్ కామెంట్స్ తో నైసా ఫ్యాన్స్ నిరుత్సాహంలో ఉన్నారు. అయితే, నైసా భవిష్యత్తు నిర్ణయాలపై ఆసక్తి కొనసాగుతోంది.


