
బాలీవుడ్ నటి కాజోల్ నటించిన ‘మా’ అనే హారర్ థ్రిల్లర్ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కాజోల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.
Key Points
కాజోల్ నటించిన 'మా' సినిమా జూన్ 27న విడుదలవుతోంది.
ఈ హారర్ థ్రిల్లర్ చిత్రంలో కాజోల్ ఒక తల్లి పాత్రలో నటిస్తుంది.
'మా' చిత్రం థియేటర్లలో విడుదల కావడంపై కాజోల్ ఆనందం వ్యక్తం చేసింది.
సినిమా స్క్రిప్ట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందని కాజోల్ అభిప్రాయపడింది.
‘మా’ సినిమా విడుదల తేదీ
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజోల్(Kajol) నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మా’(maa). ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను విశాల్ రేవంత్ ఫూరియా(Vishal Revanth Furia) తెరకెక్కిస్తుండగా.. ఈ మూవీకి జీయే స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై అజయ్ దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్ నిర్మిస్తున్నారు. అయితే దెయ్యం బారిన పడిన తన కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన యుద్ధం కథ ఆధారంగా. ఈ సినిమాలో తనూజ దేవ్‌గన్, రోనిత్‌రాయ్, ఇంద్రనీల్, జితిన్ జ్యోతి గులాటీ(Jittin Jyoti Gulati), సుభద్ర సేన్‌గుప్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 27న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.
ప్రమోషన్స్‌లో భాగంగా కాజోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను ఉత్సాహంగా ఉన్నాను. చాలా ఏళ్ల తర్వాత నా సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. ప్రతి నటి ప్రతిసారీ తమను తాము తిరిగి ఆవిష్కరించుకోవాలి. నేను ఎప్పుడూ హారర్ సినిమా చేస్తానని అనుకోలేదు. ‘మా’ స్క్రిప్ట్ విన్నప్పుడు, మేము హారర్ సినిమా చేస్తున్నామని అనుకోలేదు. థ్రిల్లర్ మూవీ చేస్తున్నట్టు అనిపించింది. కానీ స్క్రిప్ట్ వచ్చే సమయానికి, క్లైమాక్స్ ఎలా ఉండాలో మేము ఫిక్స్ అయ్యే సమయానికి.. దానిని హారర్‌గా మార్చాల్సి వచ్చింది. కాబట్టి, మా ప్రయత్నాలు ఫలించాయని అనుకుంటున్నాను. మా సినిమా పెద్ద తెరపై విడుదలకు సిద్ధంగా ఉందని మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది మంచి, గట్టి స్క్రిప్ట్, అన్నింటికంటే ముఖ్యమైనది. నా అభిప్రాయం ప్రకారం.. అంబిక పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది.
కాజోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సినిమా కథాంశం
కాజోల్ ‘మా’ సినిమాపై ఆశాభావంతో ఉంది. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆమె నమ్ముతోంది. సినిమా విజయవంతం అవుతుందని ఆమె ఆశించింది.


