|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘కల్కి​’2 కి బ్రేక్‌.. సాయి పల్లవితో చర్చలు.. నాగ్‌ అశ్విన్‌ ప్లాన్‌ ఏంటి?

Published: 04-10-2025, 11:40 AM
‘కల్కి​’2 కి బ్రేక్‌.. సాయి పల్లవితో చర్చలు.. నాగ్‌ అశ్విన్‌ ప్లాన్‌ ఏంటి?

‘కల్కి 2’ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రభాస్ డేట్స్ లభ్యం కాకపోవడంతో నాగ్ అశ్విన్ ఈ గ్యాప్‌లో సాయి పల్లవితో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ వివరాలపై ఆసక్తి నెలకొంది.

Key Points

1

ప్రభాస్ డేట్స్ కుదరక కల్కి 2 చిత్రీకరణకు బ్రేక్.

2

నాగ్ అశ్విన్ లేడీ ఓరియెంటెడ్ మూవీపై దృష్టి.

4

కల్కి 2 నుండి దీపికా పదుకొణె అవుట్, కొత్త హీరోయిన్ కోసం వేట.

కల్కి 2 వాయిదా ఎందుకు?

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌(Nag Ashwin ) తెరకెక్కించిన పాన్‌ ఇండియా మూవీ ‘‍కల్కి’ 2898 ఏడీ’(Kalki 2898 AD) ఇండస్ట్రీని షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో రిలీజైన అయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని రిలీజ్‌ సమయంలోనే ప్రకటించాడు. అంతేకాదు దానికి సంబంధించిన వర్క్‌పైనే నాగ్‌ అశ్విన్‌ ఇన్నాళ్లు దృష్టి పెట్టాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం అవుతుందని భావిస్తున్నవేళ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి నాగ్‌ చిన్నపాటి షాక్‌ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుని కొన్నాళ్ల పాటు పక్కకు పెట్టి.. ఓ లేడి ఓరియెంటెండ్‌ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.

ఆలియా అవుట్‌.. సాయి పల్లవి ఇన్‌? కల్కి చిత్రానికి కంటే ముందే నాగ్‌ అశ్విన్‌ ఓ లేడీ ఓరియెంటెండ్‌ స్టోరీ రాసుకున్నాడు. ఈ చిత్రాన్ని కూడా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్‌ చేశాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌కి కథ కూడా వినిపించాడట. ఆమె కూడా ఈ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆలియా తప్పుకుందట. డేట్స్‌ కుదరకపోవడంతో నాగ్‌ అశ్విన్‌కి నో చెప్పేసిందట. దీంతో నాగ్‌ అశ్విన్‌ ఇప్పుడు ఈ కథను సాయి పల్లవి(sai Pallavi)తో తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఇప్పటికే సాయి పల్లకి స్టోరీ నెరేట్‌ చేశాడని..ఆమె కూడా ఒప్పుకుందని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.

నాగ్ అశ్విన్ తదుపరి సినిమా

కల్కి 2  ఎప్పుడు? వాస్తవానికి నాగ్‌ అశ్విన్‌ ఇప్పుడు కల్కి 2 చిత్రాన్నే తెరకెక్కించాలి. ఈ మేరకు పనులు కూడా ప్రారంభించారు. అయితే ప్రభాస్‌ డేట్స్‌ కుదరడం లేదట.   ప్రస్తుతం ఆయన రాజాసాబ్‌(పాటలు), ఫౌజీ సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే ‘స్పిరిట్‌’ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. మరోవైపు సలార్‌ 2 స్క్రిప్ట్‌ కూడా రెడీగా ఉంది. వీటి తర్వాతే కల్కి 2కి ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చే చాన్స్‌ ఉంది.

సాయి పల్లవి ఎంట్రీ

ఈ లెక్కన దాదాపు ఏడాది వరకు ప్రభాస్‌(Prabhas) డేట్స్‌ దొరకడం కష్టమే. మరోవైపు ఈ సినిమా నుంచి దీపికా పదుకొణెను తప్పించారు. ఇప్పుడు కొత్త హీరోయిన్‌ని ఎంపిక చేయాలి. దీనికి కొంత సమయం పడుతుంది.  అందుకే నాగ్‌ అశ్విన్‌ ఈ గ్యాప్‌లో మరో సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం సాయి పల్లవి డేట్స్‌ కూడా ఖాలీగానే ఉన్నాయట. ‘రామాయణ్‌’ మినహా ఆమె చేతిలో మరో చిత్రమేది లేదు. నాగీ కూడా వచ్చే రెండు, మూడు నెలల్లోనే ఈ మూవీ షూటింగ్‌ కంప్లీట్‌ చేయాలని చూస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలోనే నాగ్‌ అశ్విన్‌- సాయి పల్లవిల సినిమాను తెరపై చూడొచ్చు.

మొత్తంగా, ‘కల్కి 2’ ఆలస్యం అయినప్పటికీ, నాగ్ అశ్విన్ ఖాళీగా ఉండకుండా సాయి పల్లవితో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం విశేషం. ఈ నిర్ణయం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.