|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కల్కి 2: ఆర్జీవీ తర్వాత జేడీ చక్రవర్తి ఎంట్రీతో షాక్! ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే!!

Published: 22-03-2026, 2:35 AM
కల్కి 2: ఆర్జీవీ తర్వాత జేడీ చక్రవర్తి ఎంట్రీతో షాక్! ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే!!
  • కల్కి 2లో కీలక పాత్రలో జె.డి. చక్రవర్తి.. షూటింగ్‌లో ప్రత్యక్షం!
  • ప్రభాస్ ఎంట్రీకి ముందే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి!
  • కమల్ హాసన్ పూర్తిస్థాయి విలన్‌గా విశ్వరూపం చూపించనున్నాడు!
  • హీరోయిన్ విషయంలో మార్పులు.. దీపికా స్థానంలో కొత్త హీరోయిన్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీ సంచలనం సృష్టించింది. ఇప్పుడు సీక్వెల్ మరింత ఉత్కంఠ రేపుతోంది. కల్కి 2లో ఊహించని ట్విస్ట్ లు ఉండబోతున్నాయని సమాచారం.

కల్కి సీక్వెల్‌లో జేడీ చక్రవర్తి సర్‌ప్రైజ్ ఎంట్రీ!

Kalki 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ ‘కల్కి పార్ట్-2(Kalki 2)’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం ముగిసిన చోట నుంచి కథ ఎటు మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, కల్కి సీక్వెల్ షూటింగ్ పనులు ఇప్పటికే శరవేగంగా సాగుతున్నాయి. ప్రభాస్ సెట్స్‌లోకి అడుగుపెట్టకుండానే కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నాడు దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి అగ్ర నటులపై ముఖ్యమైన సీన్లను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ రెండో భాగంలో ఒక సర్ప్రైజ్ ఎంట్రీ ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ప్రభాస్ లేకుండానే షూటింగ్.. కారణం ఇదే!

వెర్సటైల్ నటుడు జె.డి. చక్రవర్తి కల్కి 2లో స్పెషల్ రోల్ చేస్తున్నాడట. ఇప్పటికే ఆయన షూటింగ్ సెట్స్‌లో కూడా ప్రత్యక్షమయ్యారని, సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో ఆయన కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే, ఈయన పాత్రను అలాగే సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా ఉంచుతారా. లేక రివీల్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు, రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అతి త్వరలోనే కల్కి సెట్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నాగ్ అశ్విన్ ఈసారి యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

విలన్‌గా కమల్ హాసన్.. ఈసారి హీరోయిన్ ఎవరు?

మొదటి భాగంలో సుప్రీమ్ యాస్కిన్‌గా భయపెట్టిన కమల్ హాసన్, ఈ సీక్వెల్‌లో పూర్తిస్థాయి విలన్‌గా విశ్వరూపం చూపించబోతున్నారు. అయితే, ఈసారి హీరోయిన్ విషయంలో చిన్న మార్పు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకోన్ ఇప్పటికే ఈ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ఎవరు చేస్తున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

కల్కి 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. జేడీ చక్రవర్తి ఎంట్రీ సినిమాకు మరింత బూస్ట్ ఇవ్వనుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.