
📌 Key Points
- ప్రభాస్, మారుతి కాంబోలో ‘ది రాజాసాబ్’ మూవీ విడుదల, మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లలో సందడి!
- విమల్ థియేటర్ వద్ద అభిమానుల అసౌకర్యానికి మారుతి క్షమాపణలు, అర్థరాత్రి వరకు ఎదురుచూపులు!
- ప్రభాస్ నాలాంటి మిడ్ రేంజ్ డైరెక్టర్‌తో సినిమా చేయడం సంతోషంగా ఉంది అన్న మారుతి.
- మూడు గంటల సినిమాను 1.30 నిమిషాలకు వేయడంతో నిద్ర చెడగొట్టినందుకు క్షమాపణలు చెప్పిన మారుతి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వచ్చిన ‘ది రాజాసాబ్’ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమాకి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం!
విడుదలైన ‘ది రాజాసాబ్’ మూవీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి(Maruthi) కాంబోలో భారీ అంచనాల మధ్య వచ్చిన మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab). ఈ సినిమా జనవరి 9న విడుదలై.. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే పలు విమర్శలు చేస్తూ.. ప్రభాస్ అభిమానులు.. సినిమా థియేటర్స్‌ల్లో నానా హంగామా చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, మారుతి స్పందించి క్షమాపణలు చెప్పారు. ‘‘మీడియా ఫ్రెండ్స్.. విమల్ థియేటర్ వద్ద మిత్రులు చాలా అసౌకర్యానికి గురయ్యారు. అర్థరాత్రి 1. 30 వరకు కూడా షోలు పడకపోయేసరికి చలిలో నిలబడ్డారని విన్నాను. నిజంగా అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను.
ఎందుకంటే నాకు తెలియదు.. అంటే నా కప్ ఆఫ్ టీ కాదు అది. చాలామంది మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా.. 1. 30కిఒక మూడు గంటల సినిమాఅది పడుకుని మంచి నిద్రలో ఉండాల్సిన సమయంలోమైండ్ గేమ్ చూపించాం. ఆ మైండ్ గేమ్ తర్వాత రిజల్ట్ కరెక్ట్‌గా నాలుగున్నరకి బాగా రాశారు. మంచిగ రాసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.ప్రభాస్ గారు నాలాంటి మిడ్ రేంజ్ డైరెక్టర్‌తో ఇలాంటి కొత్త సినిమాను మీకు అందించారు. ఆ అందించిన చిత్రాన్ని మీరు ముందుకు తీసుకెళుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.
ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన మారుతి
మిడ్ రేంజ్ డైరెక్టర్ తో సినిమా చేసినందుకు ప్రభాస్ కి కృతజ్ఞతలు
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘ది రాజాసాబ్’ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


