
📌 Key Points
- ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబో సినిమా ఆగిపోలేదని మేకర్స్ ప్రకటన!
- ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని వెల్లడి.
- సరైన సమయం చూసుకొని త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
- ప్రశాంత్ వర్మ ప్రస్తుతం రిషబ్ శెట్టితో ‘జై హనుమాన్’ సినిమా చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి సినిమా చేస్తున్నారా లేదా అనే సందిగ్ధతకు తెరపడింది. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ గురించి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!
ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమా నిజమెంత?
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ కి ఉన్న లైనప్ ఇండియాలో మరే హీరోకి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్ లో ఉన్నారు. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఇక ఈ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్.
ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత కల్కి 2, సలార్ 2 సినిమాలను చేయాల్సి ఉంది ప్రభాస్(Prabhas). అయితే ఈ రెండు సినిమాలకే కాకుండా మరో క్రేజీ ప్రాజెక్టును కూడా ఒకే చేశాడు ప్రభాస్. అది కూడా చాలా కాలం క్రితమే. ఆ ప్రాజెక్టు మరేదో కాదు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు. ఈ డైరెక్టర్ హనుమాన్ రిలీజ్ టైంలోనే ఒక కథను ప్రభాస్ కు వినిపించాడు. ఆ ప్రాజెక్టు కూడా ఒకే అయ్యింది.
సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదు!
ఇండియన్ మైథాలజీలోని కథాంశంతో ఈ సినిమా రానుంది అని అప్పటిలో కథనాలు కూడా వచ్చాయి. అయితే, గత కొన్నిరోజులుగా మాత్రం ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని, దానికి కారణం ప్రశాంత్ వర్మ వరుసగా సినిమాలను ఒకే చేయడమే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు మేకర్స్ వద్దకు వెళ్లడంతో తాజాగా ప్రభాస్- ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
త్వరలో రానున్న అధికారిక ప్రకటన!
“ప్రభాస్- ప్రశాంత్ వర్మ సినిమా ప్లానింగ్ ప్రకారమే సాగుతోంది. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు పూర్తి కాగానే మా సినిమాపై అధికారిక ప్రకటన వస్తుంది. సరైన సమయం కోసమే చూస్తున్నాం” అని తెలిపినట్టుగా సమాచారం. దీంతో, గత కొన్నిరోజులుగా వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన రిషబ్ శెట్టితో జై హనుమాన్ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.
ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ మూవీపై వస్తున్న ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని వివరాలు అందిస్తాం.


