|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kamakshi Bhaskarla: హీరోయిన్స్ ఎందుకు చేయకూడదు.. నాకు నేనే సవాల్ చేసుకున్నా.. ఇప్పుడు అదే చేస్తున్నా..

Published: 16-11-2025, 6:13 AM
Kamakshi Bhaskarla: హీరోయిన్స్ ఎందుకు చేయకూడదు.. నాకు నేనే సవాల్ చేసుకున్నా.. ఇప్పుడు అదే చేస్తున్నా..

కామాక్షి భాస్కర్ల, పొలిమేర సినిమాతో గుర్తింపు పొందింది. తాజాగా తన కొత్త చిత్రం “12ఎ రైల్వే కాలనీ” ప్రమోషన్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్స్ కొత్త పాత్రలు చేయాలని, అందుకు తను సవాల్ చేసుకున్నానని ఆమె చెప్పింది.

Key Points

1

పొలిమేర 1 & 2 సినిమాల ద్వారా కామాక్షి భాస్కర్ల విశేష గుర్తింపు పొందింది.

2

పొలిమేర 2 చిత్రానికి దాదా సాహెబ్ ఫాల్కే 2024 జ్యురీ అవార్డును అందుకుంది.

4

హీరోయిన్స్ విభిన్న, సవాలుతో కూడిన పాత్రలు చేయాలనే ఉద్దేశంతో తనకు తాను సవాల్ చేసుకున్నానని తెలిపింది.

పొలిమేర విజయంతో పాటు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

Kamakshi Bhaskarla: కామాక్షి భాస్కర్ల.. ఈ నటి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇక పొలిమేర సినిమాలో నటి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. రా అండ్ రస్టిక్ పాత్రలో ఆమె చూపించిన నటన ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా (Kamakshi Bhaskarla)వచ్చిన పొలిమేర 2 సినిమాలో కూడా ఆమె అద్భుతమైన నటనను కనబరించింది. ఈ సినిమాకు గాను దాదా సాహెబ్ ఫాల్కే 2024 జ్యురీ అవార్డు కూడా అందుకుంది కామాక్షి. ఈ సినిమాల తరువాత కూడా చాలా మంచి మంచి సినిమాలు చేసింది ఈ బ్యూటీ.

‘12ఎ రైల్వే కాలనీ’లో కీలకమైన ‘ఆరాధన’ పాత్ర

Prabhas-Prem rakshith: ప్రభాస్ లిస్టులో మరో వరల్డ్ క్లాస్ మూవీ.. ఆస్కార్ విన్నర్ తో భారీ సినిమా.. అయితే ఇది కూడా..

విభిన్న పాత్రలపై కామాక్షి భాస్కర్ల సవాల్

ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “12ఎ రైల్వే కాలనీ”. అల్లరి నరేష్ హీరోగా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు నాని కసరగడ్డ తెరకెక్కిస్తున్నాడు. టీజర్ తో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో, ప్రమోషన్స్ లో వేగం పెంచారు టీం. ఇందులో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంది కామాక్షి భాస్కర్ల. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. “ఇది చాలా ఆసక్తితో సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా. ఆరాధన అనే పాత్రలో నేను కనిపిస్తా. సినిమాలో నా పాత్ర చాలా కీలకం. ఆ పాత్ర లేకపోతే సినిమానే లేదు. సినిమాలో నా పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. విజయ్‌ సేతుపతి, సుహాస్‌, శ్రీవిష్ణు ఇలా చాలా మంది హీరోలు కొత్త కొత్త పాత్రలు చేస్తున్నారు. అలా హీరోయిన్స్ ఎందుకు చేయకూడదు అని ఒక సవాల్‌గా తీసుకున్నా”అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. కామాక్షి భాస్కర్ల.

కామాక్షి భాస్కర్ల తన కెరీర్‌లో విభిన్న పాత్రలు ఎంచుకుంటూ, హీరోయిన్స్‌కి కొత్త ఒరవడి సృష్టించాలని చూస్తోంది. ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం యువ నటీమణులకు స్ఫూర్తినిస్తాయనడంలో సందేహం లేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.