|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కామాక్షి ముందరే స్టార్ట్ అయింది నా కథే.. ‘చెన్నై లవ్ స్టోరీ’ అప్డేట్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం

Published: 17-06-2026, 3:16 PM
కామాక్షి ముందరే స్టార్ట్ అయింది నా కథే.. ‘చెన్నై లవ్ స్టోరీ’ అప్డేట్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం

‘క’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు ప్రకటిస్తూ జోరుమీదున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా చిత్రాలు తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. ‘బేబీ’ ఫేమ్ సాయి రాజేష్ ఈ మూవీకి కథ అందించడంతో పాటు ఎస్కేఎన్‌తో కలిసి నిర్మిస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన శ్రీగౌరీ ప్రియ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఇది కేవలం ఫస్ట్ లవ్ గురించే కాకుండా.. ఫెయిల్యూర్ లవ్ తర్వాత జీవితంలో మొదలయ్యే అసలైన ప్రేమ కథ ఆధారంగా సాగుతుంది. ఇక ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన మూడో పాట ‘జిగితార’ జూన్ 20న రాబోతున్నట్లు తెలుపుతూ.. ‘‘కథలన్నీ కంచికే అందరూ అందురే.. కామాక్షి ముందరే స్టార్ట్ అయింది నా కథే’’ అనే క్యాప్షన్ జత చేశారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.