
లోక నాయకుడు కమల్ హాసన్ తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. ప్రస్తుతం ఆయన 4 భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు. ‘కల్కి 2898 AD’, ‘ఇండియన్ 3’, ‘విక్రమ్ 2’ మరియు ‘వేట్టైయాడు విలయాడు 2’ వంటి చిత్రాలతో ఆయన అలరించనున్నారు.
Key Points
కమల్ హాసన్ 4 భారీ సినిమాలతో బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధం.
'కల్కి 2898 AD' సీక్వెల్‌లో కమల్ హాసన్ విలన్ పాత్రలో సందడి చేయనున్నట్లు వార్తలు.
'ఇండియన్ 3' మరియు 'విక్రమ్ 2' చిత్రాలకు సీక్వెల్ ప్లాన్స్ చురుగ్గా సాగుతున్నాయి.
గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో 'వేట్టైయాడు విలయాడు' సినిమాకు సీక్వెల్ కూడా రూపొందనుంది.
కల్కి 2898 AD లో కమల్ విలన్?
కమల్ హాసన్ చివరిగా ‘థగ్ లైఫ్’ సినిమాలో కనిపించారు. ఆ సినిమా యావరేజ్ హిట్ అయింది. తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన లోకనాయకుడు.. ఈ వయస్సులో కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా.. వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. 4 సినిమాలతో బాక్సా ఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్నాడు.
‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌లతో పాటు కమల్ హాసన్ కూడా సందడి చేయనున్నారు. మీడియా కథనాల ప్రకారం, ఈ సినిమాలో ఆయన విలన్‌గా కనిపించనున్నారు. కల్కీ పార్ట్ 2 మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. మరి ఈసారి కమల్ పాత్ర ఎలా ఉంటుందోే చూడాలి.
‘ఇండియన్ 3’ పై భారీ అంచనాలు
‘ఇండియన్’ సినిమా మేకర్స్ మూడో భాగాన్ని తీయడానికి సిద్ధమవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు కాజల్, సిద్ధార్థ్, రకుల్, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఇండియన్ 2 డిజాస్టర్ అయిన క్రమంలో.. పార్ట్ 3 పై చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు టీమ్.
‘ విక్రమ్’ సినిమా థియేటర్లలో సంచలనం సృష్టించాక, ఇప్పుడు మేకర్స్ రెండో భాగాన్ని తీయబోతున్నారు. చాలా కాలం ఫెయిల్యూర్స్ తో బాధపడ్డ కమల్ హాసన్.. విక్రమ్ సినిమాతో కమ్ బ్యాక్ అయ్యాడు. ఈమూవీ కమల్ కెరీర్ లోనే అత్యధికంగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ ను చేయబోతున్నారు.
‘విక్రమ్ 2’, ‘వేట్టైయాడు విలయాడు 2’ తో హల్చల్
కమల్ హాసన్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ‘వేట్టైయాడు విలయాడు’ సినిమాకు రెండో భాగం రాబోతోందని వెల్లడించారు. ఈమూవీపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈసినిమా తమిళం వరకే రూపొందే అవకాశం ఉంది.
వరుస భారీ చిత్రాలతో కమల్ హాసన్ అభిమానులకు పండగ వాతావరణం నెలకొల్పనున్నారు. విభిన్నమైన కథాంశాలతో వస్తున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో వేచి చూడాలి. లోకనాయకుడి రాక కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


