|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kamal Haasan: కన్నడ పుట్టుకకు తమిళంతో సంబంధం లేదు.. కమల్ పై సీఎం ఫైర్

Updated: 28-05-2025, 8:27 AM
Kamal Haasan: కన్నడ పుట్టుకకు తమిళంతో సంబంధం లేదు.. కమల్ పై సీఎం ఫైర్

నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ తమిళం నుండి కన్నడ పుట్టిందని చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. కన్నడ సంఘాలు కూడా ఆయనను తీవ్రంగా విమర్శించాయి.

Key Points

1

కమల్ హాసన్ తమిళం నుంచి కన్నడ పుట్టిందని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.

2

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కమల్ హాసన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

4

బీజేపీ నేత ఆర్. అశోక కమల్ హాసన్ ను 'మానసిక రోగి' అని విమర్శించారు.

కమల్ హాసన్ వ్యాఖ్యలతో వివాదం

తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ నటుడు, రాజకీయ నేత కమల్‌హాసన్‌ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘నా జీవితం, నా కుటుంబం తమిళ భాష’ అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై క‌న్నడిగులు మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కన్నడ పుట్టుకకు తమిళంతో సంబంధం లేదని పేర్కొన్నారు. కన్నడకు సుదీర్ఘ చరిత్ర ఉందని చెప్పుకొచ్చారు. కమల్‌ హాసన్‌కు ఆ విషయాలన్నీ తెలియవంటూ ఎద్దేవా చేశారు. ‘కన్నడ పుట్టుకకు తమిళంతో సంబంధం లేదు. కన్నడకు సుదీర్ఘ చరిత్ర ఉంది. పాపం కమల్‌ హాసన్‌కు ఆ విషయాలన్నీ తెలియదనుకుంటా’ అంటూ వ్యాఖ్యానించారు.

కమల్ హాసన్ ను “మానసిక రోగి” అని బీజేపీ నేత ఆర్ అశోక విమర్శించారు. కన్నడ భాష సాంస్కృతిక గుర్తింపును అవమానించారని మండిపడ్డారు. “కర్ణాటకలో కమల్ హాసన్ అన్ని చిత్రాలను బహిష్కరించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. లేకుంటే అతను మానసిక రోగిలా వ్యవహరిస్తూనే ఉంటాడు” అని అశోక అన్నారు. కాగా.. కమ‌ల్ హాస‌న్ న‌టించిన థ‌గ్ లైఫ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నైలో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కమల్‌హాసన్ మాట్లాడుతూ.. ‘కన్నడం.. తమిళం నుంచి పుట్టింది’ అని కామెంట్ చేశారు. ఇదే కార్యక్రమానికి క‌న్నడ సూపర్ స్టార్ శివరాజ్‌ కుమార్‌ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉయిరే, ఉరవే తమిళే (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన క‌మ‌ల్ హాస‌న్ అనంత‌రం క‌న్నడ స్టార్ శివ‌రాజ్ కుమార్‌ని ఉద్దేశించి మాట్లాడారు. ‘శివరాజ్‌కుమార్ వేరే రాష్ట్రంలో నివసిస్తున్నా నా కుటుంబ సభ్యుడు. అందుకే ఆయన ఈ రోజు ఇక్కడ ఉన్నారు. అందుకే నా ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు.. నా జీవితం, నా కుటుంబం తమిళ భాష అని చెప్పా. మీ భాష (కన్నడ) తమిళ నుంచే పుట్టింది. ఆ విధంగా మీరు భాగస్వామి అయ్యారు’ అని శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న కమల్‌ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. బెంగళూరులో థగ్‌లైఫ్‌ సినిమా బ్యానర్లను కొందరు ఆందోళనకారులు చించివేశారు. ‘కర్ణాటకలో మీకు వ్యాపారం కావాలి.. కానీ కన్నడ భాషను అవమానిస్తారా?’ అని ధ్వజమెత్తారు.

సిద్ధరామయ్య, బీజేపీ నేతల ఖండన

కన్నడ సంఘాల ఆందోళనలు

కమల్ హాసన్ వ్యాఖ్యలు కన్నడ ప్రజలను మండిపించాయి. భాషా వివాదాలు రాజకీయంగా ప్రభావం చూపుతాయని ఈ ఘటన చూపిస్తోంది. భాషా గౌరవం అవసరం అని ఈ సంఘటన తెలియజేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.