|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్‌: బన్నీకి కమల్ హాసన్ షాక్! శివ కార్తికేయన్‌తో `సేయాన్` మూవీ.. త్రివిక్రమ్ ప్లాన్ రివర్స్?

Published: 16-02-2026, 12:36 PM
షాకింగ్‌: బన్నీకి కమల్ హాసన్ షాక్! శివ కార్తికేయన్‌తో `సేయాన్` మూవీ.. త్రివిక్రమ్ ప్లాన్ రివర్స్?
  • శివ కార్తికేయన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ `అమరన్`.. రూ.300 కోట్ల వసూళ్లు!
  • కమల్ హాసన్ నిర్మాణంలో శివ కార్తికేయన్ 26వ చిత్రం.. `సేయాన్` మూవీ!
  • మురుగన్ భక్తుడిగా శివ కార్తికేయన్.. `గాడ్‌ ఆఫ్‌ వార్‌` కథతో సినిమా!
  • త్రివిక్రమ్, అల్లు అర్జున్ మూవీకి దెబ్బ.. సేమ్ స్టోరీ లైన్ తో మూవీ ప్లాన్!

టాలీవుడ్ లో సంచలనం! కమల్ హాసన్ నిర్మాణంలో శివ కార్తికేయన్ హీరోగా `సేయాన్` మూవీ రాబోతుంది. ఈ సినిమా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీకి పోటీగా నిలవనుందా? అసలు ఏం జరుగుతోంది?

కమల్ హాసన్ నిర్మాణంలో శివ కార్తికేయన్ మూవీ

మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా వచ్చిన  ‘అమరన్’ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.  ఈ సినిమా శివకార్తికేయన్  కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఇక ఇప్పుడు కమల్‌ నిర్మాణంలో శివకార్తికేయన్‌ హీరోగా మరో సినిమా రాబోతుంది.

శివకార్తికేయన్ 26వ చిత్రాన్ని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  ఈ మూవీకి `సేయాన్‌` అనే పేరు పెట్టారు. శివకార్తికేయన్-కమల్ హాసన్ కాంబోలో ఇది రెండో సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

`సేయాన్` టైటిల్ లీక్.. స్టోరీ ఇదేనా?

శివకార్తికేయన్ నిర్మించిన ‘తాయికిళవి’ సినిమా దర్శకుడు శివకుమార్ మురుగేశన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈయన గతంలో ‘కడైసి వివాసాయి’ చిత్రానికి పనిచేశారు. గతేడాది బంపర్ హిట్ అయిన ‘ఆన్ పావం పొల్లాదదు’ సినిమాకు రచయిత కూడా. ‘తాయికిళవి’ కథ, చిత్రీకరణ, అవుట్‌పుట్ చూసి ఇంప్రెస్ అయిన శివకార్తికేయన్ వెంటనే ఈ దర్శకుడిని తన సినిమాకు తీసుకున్నారు. భారీ స్థాయిలో ఈ మూవీని ప్లాన్‌ చేస్తున్నారట.

SK26 ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం విడుదల కానుండగా, అంతకంటే ముందే టైటిల్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చేతిలో వేల్ (శూలం లాంటి ఆయుధం) పట్టుకుని నిలబడిన ఫోటో ఉంది. దీన్ని బట్టి చూస్తే, ఈ చిత్రానికి తమిళ దేవుడు మురుగన్ పేర్లలో ఒకటైన ‘సేయాన్‌’ అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ మురుగన్ భక్తుడిగా నటిస్తున్నట్లు సమాచారం. `గాడ్‌ ఆఫ్‌ వార్‌` అనే కథతోనే ఈ మూవీ రూపొందబోతుందట. కుమారస్వామి కథతోనే సినిమాని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

అల్లు అర్జున్‌కు త్రివిక్రమ్ షాక్.. కారణం అదేనా?

శివ కార్తికేయన్‌ `సేయాన్‌` మూవీ ఇప్పుడు అల్లు అర్జున్‌ మూవీకి పెద్ద దెబ్బగా మారబోతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. `గాడ్‌ ఆఫ్‌ వార్‌` కథతోనే ఈ మూవీని రూపొందించాలని భావించారు. ఇది కుమారస్వామి కథ. మొదట ఎన్టీఆర్‌ తో చేయాలనుకున్నారు త్రివిక్రమ్‌. ఆ తర్వాత బన్నీ ఓకే చెప్పారట. దీంతో ఆయనతోనే ఈ సినిమా చేయాలని భావించారట.  కానీ ఊహించని విధంగా అటు బన్నీ, ఇటు త్రివిక్రమ్‌ కి ఝలక్ ఇస్తూ కమల్‌ హాసన్‌ తన ప్రొడక్షన్‌ లో ఈ `సేయాన్‌`మూవీని ప్రకటించారు. ఇది కూడా `గాడ్‌ ఆఫ్‌ వార్‌` కథే అని టాక్‌. ఇదే నిజమైతే బన్నీ, త్రివిక్రమ్‌లకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

శివ కార్తికేయన్, కమల్ హాసన్ కాంబినేషన్ మూవీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ గురించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.