
కమల్ హాసన్ మరియు మణిరత్నం కాంబోలో తెరకెక్కిన ‘థగ్ లైఫ్’ సినిమా ఊహించినంతగా ఆకట్టుకోలేకపోతోంది. మూడు రోజుల వసూళ్లు చాలా తక్కువగా ఉండటంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
Key Points
కమల్ హాసన్, మణిరత్నం కాంబో సినిమా 'థగ్ లైఫ్' బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తోంది.
మూడు రోజుల్లో ఇండియాలో రూ.29 కోట్లకు పైగా మాత్రమే వసూలు.
ప్రపంచవ్యాప్తంగా రూ. 60-65 కోట్ల వసూళ్లు, మణిరత్నం గత సినిమాలతో పోల్చితే చాలా తక్కువ.
కమల్ హాసన్ అభిమానులు డిజాస్టర్ అని భావిస్తున్నారు.
థగ్ లైఫ్ బాక్స్ ఆఫీస్ వసూళ్లు
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ యాక్షన్ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు కాంబోలో వచ్చిన సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈనెల 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.29 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది.
అభిమానుల నిరాశ
తొలి రోజు రూ.15 కోట్లకు పైగా రాబట్టిన థగ్ లైఫ్.. రెండో రోజే ఏకంగా సగానికి పడిపోయింది. అయితే మూడో రోజు వీకెండ్ కావడంతో శనివారం రూ. 7.5 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది. దేశీయ బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజుల్లోనే రూ. 30 కోట్ల మార్కును దాటలేకపోవడంతో కమల్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.
మణిరత్నం గత విజయాలతో పోలిక
ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ‘థగ్ లైఫ్’ 3వ రోజు దాదాపు రూ. 60 నుంచి 65 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మణిరత్నం గత విజయాలతో పోలిస్తే ఈ వసూళ్లు చాలా తక్కువ. ‘పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 మరియు పార్ట్ 2’, రెండూ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 నుంచి 400 కోట్లకు పైగా వసూలు చేశాయి. థగ్ లైఫ్ వసూళ్ల పరంగా రాణించకపోవడంతో కమల్ ఖాతాలో ఈ మూవీ డిజాస్టర్‌గానే మిగలిపోయేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, శింబు, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటించారు.
థగ్ లైఫ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. కమల్ హాసన్ అభిమానులకు ఇది తీవ్ర నిరాశను కలిగించింది. ఈ సినిమా డిజాస్టర్ గానే మిగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


